PM Modi : గురుకుల వైభ‌వం ఆద‌ర్శ‌ప్రాయం

స్ప‌ష్టం చేసిన ప్ర‌ధాన మంత్రి మోదీ

PM Modi : దేశంలో కొన‌సాగుతున్న గురుకుల విద్యా సంప్ర‌దాయం ఎంద‌రికో విద్యాదానం చేస్తోందంటూ ప్ర‌శంస‌లు కురిపించారు దేశ ప్ర‌ధానమంత్రి న‌రేంద్ మోదీ. టెక్నాల‌జీ ప‌రంగా ఎన్నో మార్పులు చోటు చేసుకున్నా నేటికీ గురుకుల విద్యాల‌యాల‌లో చ‌దువుకుంటున్న వారు అత్యున్న‌త‌మైన స్థానాల‌లో కొన‌సాగుతూ వ‌చ్చార‌ని పేర్కొన్నారు పీఎం.

గురుకాల‌ల‌ను దృష్టిలో పెట్టుకుని త‌మ ప్ర‌భుత్వం నూత‌న జాతీయ విద్యా విధానాన్ని తీసుకు వ‌చ్చామ‌ని చెప్పారు. ఒకే దేశం ఒకే భాష అన్న‌ది ఉంటే మ‌రింత చ‌దువుకునేందుకు ఆస్కారం ఏర్ప‌డుతుంద‌న్నారు. దీని వ‌ల్ల ఒకే స‌మూహం అన్న భావ‌న పెరుగుతుంద‌ని చెప్పారు మోదీ(PM Modi) .

తాము తీసుకు వ‌చ్చిన విద్యా విధానం ప్ర‌పంచంలోనే టాప్ లో ఉంద‌న్నారు. దీని వ‌ల్ల మెరుగైన విద్య అందుతుంద‌ని చెప్పారు. ఇదిలా ఉండ‌గా శ్రీ స్వామి నారాయ‌ణ్ గురుకుల్ రాజ్ కోట్ సంస్థాన్ 75వ అమృత్ మ‌హోత్స‌వం సంద‌ర్భంగా న‌రేంద్ మోదీ ప్ర‌సంగించారు. ఆయ‌న వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా మాట్లాడారు.

స్వామి నారాయ‌ణ్ గురుకుల సంస్థ మ‌రింతగా ఎద‌గాల‌ని, పిల్ల‌ల‌ను మ‌రింత ప్ర‌యోజ‌కులుగా మార్చేలా చేయాల‌ని కోరారు ప్ర‌ధాన‌మంత్రి. ఇస్రో నుండి షార్క్ దాకా అత్యున్న‌త ప‌ద‌వుల్లో ఉన్న వారంతా గురుకులాల సంప్రదాయంలో చ‌దువుకుని వ‌చ్చిన వారేన‌ని స్ప‌ష్టం చేశారు న‌రేంద్ర మోదీ(PM Modi) . పేద విద్యార్థుల‌కు సాయం చేయ‌డం అభినంద‌నీయ‌మ‌ని పేర్కొన్నారు.

గార్గి, మైత్రేయి వంటి మ‌హిళా సాధ‌వులు అందించిన సేవ‌ల‌ను ఈ సంద‌ర్భంగా గుర్తు చేసుకున్నారు ప్ర‌ధాన మంత్రి. ప్రాచీన కాలం నాటి గురుకులాల వైభ‌వం గొప్ప‌ద‌న్నారు.

Also Read : ప్ర‌జా యాత్ర‌కు జ‌నం బ్ర‌హ్మ‌ర‌థం

Leave A Reply

Your Email Id will not be published!