IND vs BAN 2nd Test 2022 : గెలుపు ముంగిట భార‌త్..టార్గెట్ 145

231 ప‌రుగుల‌కే బంగ్లా ఆలౌట్

IND vs BAN 2nd Test 2022 : బంగ్లా టూర్ లో ఉన్న భార‌త జ‌ట్టు టెస్టు సీరీస్ కైవ‌సం చేసుకునే దిశ‌గా అడుగులు వేస్తోంది. మొద‌టి టెస్టులో ఘ‌న విజ‌యాన్ని సాధించిన టీమిండియా రెండో టెస్టులో కూడా అదే జోరు కొన‌సాగిస్తోంది. భార‌త బౌల‌ర్లు అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌నతో బంగ్లాదేశ్ వెంట వెంట‌నే వికెట్లు కోల్పోయింది.

ఇప్ప‌టికే మొద‌టి ఇన్నింగ్స్ లో 227 ప‌రుగుల‌కు బంగ్లా చాప చుట్టేసింది. ఇక భార‌త జ‌ట్టు తొలి ఇన్నింగ్స్ లో 314 ప‌రుగులు చేసింది. అనంత‌రం బ‌రిలోకి దిగిన ఆతిథ్య జ‌ట్టు 231 ప‌రుగుల‌కే ఆలౌటైంది.

దీంతో తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 87 ప‌రుగుల ఆధిక్యంలో ఉంది. కేవ‌లం రెండో టెస్టు(IND vs BAN 2nd Test 2022) గెల‌వాలంటే ఇంకా భార‌త జ‌ట్టు 145 ప‌రుగులు చేయాల్సి ఉంది.

ఆట మూడో రోజుతో పాటు నాలుగు, ఐదో రోజు ఉంది. అంటే ఏదో అద్భుతం జ‌రిగితే త‌ప్పా బంగ్లాదేశ్ ఓట‌మి ఖాయ‌మ‌ని తేలి పోయింది. ఇప్ప‌టికే టీమిండియాలో ఒక‌రు ఆడ‌క పోయినా ఇత‌ర ఆట‌గాళ్లు ఆడుతూ వ‌స్తున్నారు.

తొలి టెస్టులో పుజారా, శ్రేయ‌స్ అయ్య‌ర్ ఆడితే సెకండ్ టెస్టులో పంత్ , అయ్యర్ అదుర్స్ అనిపించేలా ఆడారు. ఇటీవ‌లి కాలంలో పంత్ పేల‌వ‌మైన ఆట తీరుతో తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నాడు. వాట‌న్నింటికి చెక్ పెట్టాడు. 92 ర‌న్స్ తో రాణించాడు. అయ్య‌ర్ కూడా 87 ర‌న్స్ తో స‌త్తా చాటాడు.

ఇక బౌల‌ర్ల విష‌యానికి వ‌స్తే అక్ష‌ర్ ప‌టేల్ మూడు వికెట్లు తీశాడు. అశ్విన్ , సిరాజ్ చెరో రెండు వికెట్లు తీశారు. ఉనాద్క‌త్ , ఉమేష్ యాద‌వ్ చెరో వికెట్ ప‌డగొట్టారు. ఇక బంగ్లా జ‌ట్టులో హ‌స‌న్ 51 ర‌న్స్ చేస్తే లిట్ట‌న్ దాస్ 73 ప‌రుగుల‌తో ఆక‌ట్టుకున్నారు.

Also Read : కావ్య మార‌న్ మెచ్చిన చిన్నోడు

RCB IPL 2023 Auction : ఆట‌గాళ్ల స‌మ‌తూకం ఆర్సీబీ అంద‌లం

Leave A Reply

Your Email Id will not be published!