Raghav Chadha : కేంద్రం క‌రోనా ప్రోటోకాల్ జారీ చేయాలి

ఎంపీ రాఘ‌వ్ చద్దా ప్ర‌ధాన డిమాండ్

Raghav Chadha : క‌రోనాను నియంత్రించేందుకు గాను ముందు జాగ్ర‌త్త‌గా మ‌రోసారి క‌రోనా ప్రోటోకాల్ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను జారీ చేయాల‌ని కోరారు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘ‌వ్ చ‌ద్దా(Raghav Chadha). కేంద్ర స‌ర్కార్ ఈ విష‌యంలో త‌క్ష‌ణ‌మే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. శ‌నివారం ఆప్ జాతీయ అధికార ప్ర‌తినిధి మీడియాతో మాట్లాడారు. మాస్క్ లు విధిగా ధ‌రించాల‌ని, భౌతిక దూరం పాటించాల‌ని కోరారు. లేక పోతే ప్ర‌జ‌లు ఇబ్బందులు ఎదుర్కొనే ప్ర‌మాదం ఉంద‌ని హెచ్చ‌రించారు.

వ్య‌క్తులు, పార్టీల‌ను ప‌క్క‌న పెట్టాల‌ని దేశం బాగు కోసం, ప్ర‌జ‌ల ఆరోగ్యం కోసం విధిగా కోవిడ్ ప్రోటోకాల్ ల‌ను జారీ చేయాల‌ని స్ప‌ష్టం చేశారు రాఘ‌వ్ చ‌ద్దా. ఇప్ప‌టికే దేశం చాలా న‌ష్ట పోయింద‌న్నారు. క‌రోనా కార‌ణంగా 2020, 2021 రెండు సంవ‌త్స‌రాలు పెద్ద ఎత్తున న‌ష్టం వాటిల్లింద‌ని, కోట్లాది మందికి తిండి దొర‌క‌ని ప‌రిస్థితి నెల‌కొంద‌న్నారు.

ఆనాటి సంక్షోభం మ‌రోసారి రాకుండా ఉండాలంటే విధిగా మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేయాల‌ని కోరారు రాఘ‌వ్ చ‌ద్దా(Raghav Chadha). వైర‌స్ వ్యాప్తికి సంబంధించిన ప్రాథ‌మిక శాస్త్రీయ సూచ‌న‌ల‌ను అంచ‌నా వేయ‌డంలో కేంద్రం ఘోరంగా వైఫ‌ల్యం చెందింద‌ని ఆరోపించారు ఎంపీ.

ఇప్ప‌టి వ‌ర‌కు నియంత్ర‌ణ చ‌ర్యలు చేప‌ట్టిన దాఖ‌లాలు లేవు. ఎంత సేపు విమ‌ర్శ‌లు గుప్పించ‌డం త‌ప్ప కేంద్రానికి ప‌ని లేకుండా పోయింద‌న్నారు రాఘ‌వ్ చ‌ద్దా. అయితే భార‌త్ జోడో యాత్ర చేప‌ట్టిన రాహుల్ గాంధీకి కూడా ఆయ‌న సూచ‌న‌లు చేశారు. ప‌రిస్థితిని అర్థం చేసుకుని కోవిడ్ మార్గ‌ద‌ర్శ‌కాలు పాటించాల‌ని సూచించారు ఎంపీ.

Also Read : గురుకుల వైభ‌వం ఆద‌ర్శ‌ప్రాయం

Leave A Reply

Your Email Id will not be published!