Tula Uma : వేములవాడ – భారతీయ జనతా పార్టీ నుంచి టికెట్ దక్కించుకుని అనూహ్యంగా ఆఖరు నిమిషంలో బీ ఫామ్ కోల్పోయిన తుల ఉమ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఏ పాపం చేశానని టికెట్ అమ్ముకున్నారంటూ నిలదీశారు. కేవలం డబ్బు సంచులు ఉన్నోళ్లకే టికెట్లు అమ్ముకున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. తాను విప్లవోద్యమంలో పని చేయడం తప్పా అని ప్రశ్నించారు తుల ఉమ.
Tula Uma Comment
బీజేపీ హైకమాండ్ ప్రకటించిన జాబితాలో తుల ఉమకు వేములవాడ టికెట్ కేటాయించారు. ఇక్కడ బీజేపీకి చెందిన సీనియర్ నాయకుడు, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు కుమారుడు కూడా పోటీ పడ్డారు. తుల ఉమ(Tula Uma) మాజీ మంత్రి , సీనియర్ నేత ఈటల రాజెందర్ కు అత్యంత సన్నిహితురాలిగా గుర్తింపు పొందారు.
తెలంగాణ ఉద్యమ కాలంలో కీలక పాత్ర పోషించారు. ఈటెల తో పాటు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ టికెట్ విషయంలో సీరియస్ గా ప్రయత్నం చేశారు. కానీ ఉన్నట్టుండి విద్యా సాగర్ రావు పట్టు పట్టడంతో ఆయన తనయుడు వికాస్ రావుకు బీ ఫామ్ ఇచ్చారు.
బీజేపీలో బీసీ, మహిళల సంక్షేమం అన్నది కేవలం నినాదాలకే పరిమితమని తేలి పోయిందన్నారు తుల ఉమ. ఆమె కంటతడి పెట్టారు.
Also Read : CJI Governors Comment : గవర్నర్లా రాజ్యాంగేతర శక్తులా