Tungabhadra Dam : 69 ఏళ్లలో మొదటిసారి కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్ గేట్

ఆల్రెడీ, ఇరిగేషన్‌ అధికారులు తుంగభద్ర డ్యామ్‌ను పరిశీలించారు...

Tungabhadra Dam : 69ఏళ్ల తుంగభద్ర డ్యామ్‌ చరిత్రలో ఫస్ట్‌టైమ్‌ ప్రమాదం జరిగింది. వరద ఉధృతికి 19వ గేట్‌ కొట్టుకుపోయింది. కొద్దిరోజులుగా ఇన్‌ఫ్లో పెరగడంతో క్రస్ట్‌గేట్లను ఎత్తారు అధికారులు. అయితే, రాత్రి 11గంటల సమయంలో 19వ గేట్‌ కొట్టుకుపోయినట్టు గుర్తించారు. గేట్‌ చైన్‌లింగ్‌ తెగిపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం డ్యామ్‌ నుంచి లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మొత్తం గేట్లను 20 అడుగుల మేర ఎత్తారు. అయితే, వరద ఉధృతి తగ్గితే గేట్‌ రిపేర్‌పై ఫోకస్‌ పెట్టనున్నారు. ఈ నేపథ్యంలో తుంగభద్ర డ్యామ్‌ను కర్నాటక మంత్రి శివరాజ్ పరిశీలించారు. డ్యామ్‌ పరిస్థితిపై అధికారులతో మంత్రి సమీక్షించారు. గేట్ కొట్టుకుపోయిన నేపథ్యంలో.. చెన్నై, బెంగళూరు నుంచి నిపుణుల బృందం వచ్చి పరిశీలించనుంది. తుంగభద్ర డ్యామ్‌ను పరిశీలించి పరిస్థితిపై.. ప్రభుత్వానికి నిపుణుల బృందం నివేదిక అందించనుంది.

Tungabhadra Dam Gate…

ఆల్రెడీ, ఇరిగేషన్‌ అధికారులు తుంగభద్ర డ్యామ్‌(Tungabhadra Dam)ను పరిశీలించారు. అసలు గేట్‌ ఎలా కొట్టుకుపోయిందనే కారణాలను పరిశీలిస్తున్నారు. అయితే, మిగతా గేట్లకు… అలాగే డ్యామ్‌కు ఎలాంటి సమస్యా లేదంటున్నారు అధికారులు.. డ్యామ్‌లో నీటిమట్టం 20 అడుగులకు తగ్గితేనే 19వ గేట్ రిపేర్‌ సాధ్యం అంటున్నారు ఇరిగేషన్‌ అధికారులు. ప్రస్తుతం డ్యామ్‌ నుంచి వాటర్‌ రిలీజ్‌ కంటిన్యూ అవుతోంది. నీటిమట్టం తగ్గిన తర్వాత రిపేర్లు చేపట్టనున్నారు చెన్నై, బెంగళూరు నిపుణుల బృందాలు..

ఇదిలాఉంటే.. తుంగభద్ర డ్యామ్(Tungabhadra Dam) గేట్లు ఎత్తడంతో కర్నూలు జిల్లా పరిధిలోని ఆర్డీఎస్ దగ్గర తుంగభద్రా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. మంత్రాలయం దగ్గర గేట్టు పెట్టి నదిలోకి ఈతకు వెళ్లకుండా హెచ్చరికలు జారీ చేశారు. అయినా కూడా కొందరు ఖాతరు చేయకుండా నదిలోకి దిగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. మంత్రాలయం మీదుగా వరద నీరు సుంకేసుల రిజర్వాయర్ లోకి పరుగులు తీస్తోంది. నీరు రాగానే సుంకేసుల గేట్లు కూడా ఎత్తనున్నారు. ఆ తర్వాత వరద నీరంతా కర్నూలు మీదుగా కృష్ణా నదిలో కలిసి శ్రీశైలం రిజర్వాయర్‌లో కి చేరుకుంటుంది. ఇప్పటికే తుంగభద్ర డ్యామ్ నుంచి లక్ష 30 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుంది.

Also Read : Paris Olympics 2024 : నేటితో ముగియనున్న పారిస్ ఒలింపిక్స్ క్రీడలు

Leave A Reply

Your Email Id will not be published!