Twitter Executives Quit : ట్విట్టర్ కు షాక్ సీనియర్లు గుడ్ బై
చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ లీ రాజీనామా
Twitter Executives Quit : మైక్రో బ్లాగింగ్ సంస్థ ట్విట్టర్ ను $44 బిలియన్లకు టెస్లా సిఇఓ, చైర్మన్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ టేకోవర్ చేసుకున్నాక కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రోజుకో కీలక ప్రకటన చేస్తూ ఉద్యోగుల్లో ఆందోళన రేకిత్తిస్తున్నాడు మస్క్. ఆయన ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో తెలియక తల్లడిల్లుతున్నారు.
ఈ తరుణంలో తను ట్విట్టర్ ఆఫీసులోకి ఎంటర్ అయిన వెంటనే సిఇఓ పరాగ్ అగర్వాల్ , సిఎఫ్ఓ సెగెల్, లీగల్ హెడ్ విజయా గద్దెలను సాగనంపాడు. 3,978 మందికి రావద్దంటూ ఇమెల్ ద్వారా సమాచారం అందించాడు. ఇక బ్లూ టిక్ కలిగి ఉన్న వారందరికీ కోలుకోలేని షాక్ ఇచ్చాడు. ప్రతి నెలా $8 డాలర్లు ఫీజు కింద చెల్లించాలంటూ ఆదేశించాడు.
ప్రస్తుతానికి ఎనిమిది దేశాలలో అమలవుతోంది. ఇంకా భారత్ లోకి రాలేదు. ఈ తరుణంలో తాను షాక్ ల మీద షాక్ లు ఇస్తూ వస్తున్న ఎలాన్ మస్క్ కు ట్విట్టర్ లోని మరికొందరు సీనియర్లు ఝలక్ ఇచ్చారు. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ లీ కిస్నర్(Twitter Executives Quit) తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఇక ఆయనతో పాటు చీఫ్ ప్రైవసీ ఆఫీసర్ డామియన్ కీరన్ , చీఫ్ కంప్లయిన్స్ ఆఫీసర్ మరియాన్ ఫోగార్టీ గుడ్ బై చెప్పారు.
ఒక రకంగా ఎలాన్ మస్క్ కు కోలుకోలేని షాక్ అని చెప్పక తప్పదు. ట్విట్టర్ లో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియడం లేదని ఉద్యోగులు వాపోతున్నారు. ఎప్పుడు ఎలాంటి చేదువార్త వినాల్సి వస్తుందో అర్థం కావడం లేదంటున్నారు.
Also Read : పని చేయక పోతే ట్విట్టర్ పతనమే – మస్క్