Twitter New Features Comment : మస్క్ మస్త్ ట్విట్టర్ జోష్
రోజుకో ఫీచర్ తో హల్ చల్
Twitter New Features Comment : ప్రపంచాన్ని టెక్నాలజీ డామినేట్ చేస్తోంది. మైక్రో బ్లాగింగ్ సంస్థ ట్విట్టర్ టాప్ లో కొనసాగుతోంది. ఎవరూ ఊహించని రీతిలో ప్రముఖ దిగ్గజ వ్యాపారవేత్త , బిలియనీర్ టెస్లా చైర్మన్ ఎలోన్ మస్క్(Elon Musk) భారీ ధరకు కొనుగోలు చేశారు. ట్విట్టర్ లో కీలకమైన మార్పులు తీసుకు వచ్చారు. సామాజిక మాధ్యమాలలో నెంబర్ 1గా నిలుస్తోంది. తాను టేకోవర్ చేసుకున్న వెంటనే చర్యలు చేపట్టారు.
దిగ్గజ కంపెనీలతో పోటీ పడుతూ వచ్చింది నేటి దాకా ట్విట్టర్. టాప్ ఎగ్జిక్యూటివ్ లను తొలగిస్తూ వచ్చారు. కీలక నిర్ణయాలు తీసుకుంటూ వచ్చారు. కోలుకోలేని షాక్ ఇచ్చారు. ట్విట్టర్ లో సమూల మార్పులు చేశారు. సీఈవోగా పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే 12,000 మంది ఉద్యోగులను తొలగించారు. ఆపై కీలక అప్ డేట్స్ తీసుకు వచ్చారు.
Twitter New Features Comment Viral
సంస్థను ముందుకు తీసుకు వెళ్లాల్సిన బాధ్యత మీపైనే ఉందని, లేక పోతే ట్విట్టర్ ను మూసి వేస్తానంటూ సంచలన ప్రకటన చేశాడు ఎలోన్ మస్క్(Elon Musk). ఆర్థిక మాంద్యాన్ని సాకుగా చూపించి పెద్ద ఎత్తున కంపెనీలలో జాబర్స్ పై వేటు వేశాయి. ఈ సమయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఒక్కరూ శక్తి వంచన లేకుండా పని చేయాలని స్పష్టం చేశాడు. లేక పోతే వెంటనే తొలగిస్తానని హెచ్చరించాడు.
ఎలోన్ మస్క్ ఇచ్చిన వార్నింగ్ తో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. ట్విట్టర్ కు పోటీగా దిగ్గజ కంపెనీలు శత విధాలుగా ప్రయత్నం చేశాయి. ఇంకా చేస్తూనే ఉన్నాయి. సోషల్ మీడియాలో కీలకంగా ఉన్న ఫేస్ బుక్ కు చెందిన వాట్సాప్ టాప్ లో కొనసాగుతోంది. ఈ తరుణంలో తాజాగా ట్విట్టర్ కు పోటీ గా థ్రెడ్స్ ను తీసుకు వచ్చింది. భారీ స్పందన వచ్చింది. దీనిని ఎలోన్ మస్క్ కొట్టేశాడు. ఆపై ట్విట్టర్ ను మక్కీకి మక్కీ కాపీ కొట్టారంటూ ఆరోపించాడు. ఆపై ఫేస్ బుక్ సిఇఓ మార్క్ జుకర్ బర్గ్ పై కేసు వేశాడు ఎలోన్ మస్క్.
ఈ క్రమంలో సంచలన ప్రకటన చేశాడు ట్విట్టర్ సిఈవో. తానే దానిపై ఎక్కువగా ఫోకస్ పెట్టాడు. వ్యాపారాత్మకంగా మార్చేశాడు. ట్విట్టర్ కు కేరాఫ్ గా ఉన్న లోగోను మార్చేశాడు. దాని స్థానంలో ఎక్స్ ను చేర్చాడు. బ్లూ టిక్ కావాలంటే డబ్బులు చెల్లించాలని స్పష్టం చేశాడు. తాజాగా మరో కీలక ప్రకటన చేశాడు. ఎలాంటి ఫోన్ లేకుండా , మొబైల్స్ వాడకుండానే ట్విట్టర్ నుంచి వీడియో కాలింగ్, ఫోన్ కాల్ చేసుకోవచ్చంటూ ప్రకటించాడు. ఉపగ్రహం ద్వారా అతి తక్కువ ధరకే నెట్ కనెక్టివిటీ అందజేస్తామని వెల్లడించాడు ఎలోన్ మస్క్. రాబోయే రోజుల్లో ట్విట్టర్ లో ఇంకెన్ని మార్పులు రానున్నాయో వేచి చూడాలి.
ఎలోన్ మస్క్ కలలు కనడమే కాదు ఆచరణలో చేసి చూపించే దమ్మున్నోడు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఓటమి ఒప్పుకునేందుకు ఇష్టపడడు ఎలోన్ మస్క్.
Also Read : Chinna Jeeyar Swamy KCR : సీతారామ ఆలయ పునః ప్రతిష్ఠ