Vande Bharat Express: తెలుగు రాష్ట్రాలకు మరో రెండు వందే భారత్ రైళ్లు !

తెలుగు రాష్ట్రాలకు మరో రెండు వందే భారత్ రైళ్లు !

Vande Bharat Express: రైల్వే శాఖ తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్ చెప్పింది. సిటీ ఆఫ్ డెస్టినీగా గుర్తింపు పొందిన విశాఖపట్నం నుండి మరో రెండు వందే భారత్ రైళ్లను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఒకటి విశాఖ నుండి ఒడిశాలోని పూరికి, మరొకటి విశాఖపట్నం నుండి తెలంగాణాలోని సికింద్రాబాడ్ మధ్య నడవనుంది. ఈ రెండు రైళ్ళలను ఈ నెల 12వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌ గా ప్రారంభించనున్నారు. దీనితో వాల్తేర్ డివిజన్ కేంద్రంగా మొత్తం మూడు వందే భారత్ రైళ్ళు నడవబోతున్నాయి.

Vande Bharat Express Extension

విశాఖపట్నం నుండి సికింద్రాబాద్ వెళ్ళే వందే భారత్ రైలు(Vande Bharat Express)… గురువారం మినహా మిగిలిన ఆరు రోజులు నడవనుంది. ఉదయం 5.05 గంటలకు సికింద్రాబాద్లో బయలుదేరి మధ్యాహ్నం 1.50 గంటలకి వందేభారత్( రైల్‌ నంబర్-20707) విశాఖ చేరుకోనుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 2.35 గంటలకు విశాఖలో బయలుదేరి రాత్రి 11.20కి వందేభారత్ ( రైలు నంబర్-20708) సికింద్రాబాద్ చేరుకోనుంది. ఇప్పటికే విశాఖ- సికింద్రాబాద్ మధ్య ఒక వందే భారత్‌ రైలు నడుస్తుంది. ప్రయాణికులు ఆక్యుపెన్సీ ఎక్కువగా ఉండటంతో సికింద్రాబాద్- విశాఖ మధ్య మరొక వందేభారత్ రైలును కేటాయించారు.

విశాఖ- పూరి మధ్య వందే భారత్ పరుగులు పెట్టనుంది. శనివారం మినహా మిగిలిన ఆరు రోజులలో పూరి- విశాఖ మధ్య వందేభారత్ నడవనుంది. వందేభారత్ ( రైలు నంబర్- 20841) రైలు పూరిలో ఉదయం 5.15 బయలుదేరి… ఉదయం 11.30 గం.లకి విశాఖ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 3.40కి బయలుదేరి రాత్రి 9.55 గంటలకి పూరి వందేభారత్ ( రైలు నంబర్- 20842) చేరుకోనుంది. కుర్దా రోడ్, బ్రహ్మపూర్, పలాస, శ్రీకాకుళం రోడ్, విజయనగరంలో ఈ వందే భారత్ కు స్టాపేజ్‌లు ఉన్నాయి.

Also Read: KT Ramarao: ఎల్‌ఆర్‌ఎస్‌ అమలుపై సీఎం రేవంత్‌ రెడ్డికి కేటీఆర్ లేఖ !

Leave A Reply

Your Email Id will not be published!