Pakistan Spy: పంజాబ్‌లో ఇద్దరు అనుమానిత పాకిస్తాన్ గూఢచారులు అరెస్ట్‌

పంజాబ్‌లో ఇద్దరు అనుమానిత పాకిస్తాన్ గూఢచారులు అరెస్ట్‌

Pakistan Spy : పాకిస్తాన్‌కు కీలక సమాచారాన్ని చేరవేస్తున్నారన్న అభియోగాలపై ఇద్దరు గూఢచారులను పంజాబ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాక్‌ కు కీలక సమాచారం చేరవేసిసట్లు గుర్తించిన పంజాబ్‌ పోలీసులు… ఇద్దరిపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. దీనికి సంబంధించి గుర్‌ప్రీత్‌ సింగ్‌, సాహిల్‌ మాసిహ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Pakistan Spy Arrested in Punjab

వీరికి ఐఎస్‌ఐ ఏజెంట్‌ జావెద్‌తో సంబంధాలున్నట్లు గుర్తించారు. ప్రధానంగా జావెద్‌ తో గుర్‌ప్రీత్‌కు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ప్రాథమిక విచారలో వెల్లడైంది. పంజాబ్‌లోని ధరివాల్‌ కు చెందిన గుర్‌ప్రీత్‌ సింగ్‌ (Gurpreet Singh) ప్రస్తుతం ఇండియన్‌ ఆర్మీలో విధులు నిర్వహిస్తున్నాడు. సాహిల్‌ కు అదే ప్రాంతానికి చెందినవాడు కావడంతో పాటు ఇండియన్‌ ఆర్మీలోనే ఉన్నాడు. వీరిద్దరూ కలిసి నేరుగా పాకిస్తాన్‌ (Pakistan) ఐఎస్‌ఐ ఏజెంట్లతో సంబంధాలు ఏర్పరుచుకుని కీలక సమాచారాన్ని చేరవేస్తున్నారనేది ప్రధాన అభియోగం.

పహల్గాం ఉగ్ర దాడి నిందితులకు ఆశ్రయం ఇచ్చిన ఇద్దరు అరెస్ట్‌

పహల్గాం ఉగ్రదాడిలో భాగస్వామ్యం కలిగిన ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన ఇద్దరిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)ఆదివారం అరెస్టు చేసింది. వీరిని పహల్గామ్‌ కు చెందిన పర్వైజ్ అహ్మద్ జోథర్, బషీర్ అహ్మద్ జోథర్‌లుగా గుర్తించింది. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ)తో సంబంధం కలిగిన ముగ్గురు సాయుధ ఉగ్రవాదులకు వీరు ఆశ్రయం కల్పించడంలో పాటు వారికి ఆహారం, ఇతర సదుపాయాలు కల్పించారని ఎన్‌ఐఏ ఒక ప్రకటనలో తెలిపింది.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఉగ్రదాడి కేసుపై ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తోంది. ఈ దాడికి ముందు హిల్ పార్క్ ప్రాంతంలోని ఈ ఉగ్రవాదులను నిందితులు దాచి ఉంచారని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. విచారణ సమయంలో పర్వైజ్, బషీర్‌ ఈ ఉగ్రదాడిలో పాల్గొన్నవారి గుర్తింపులను వెల్లడించారని, వారు పాకిస్తానీ జాతీయులని నిర్ధారించారని దర్యాప్తు అధికారులు వెల్లడించారు.

పర్యాటకులను వారి మతపరమైన గుర్తింపు ఆధారంగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. ఇది ఇటీవలి కాలంలో ఈ ప్రాంతంలో జరిగిన భారీ ఉగ్రదాడులలో ఒకటిగా నిలిచింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం, 1967లోని సెక్షన్ 19 కింద వీరిద్దరినీ అరెస్టు చేశారు. ఏప్రిల్ 22న పహల్గామ్‌లోని బైసరన్ లోయలో పాకిస్తాన్ ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరిపి, 26 మందిని పొట్టనపెట్టుకున్నారు. ఈ దాడుల్లో16 మంది గాయపడ్డారు.

Also Read : Amit Shah: మావోయిస్టులకు అమిత్‌ షా స్ట్రాంగ్ వార్నింగ్

Leave A Reply

Your Email Id will not be published!