U19 ICC World Cup Comment : ఆడ‌బిడ్డల అద్భుత విజ‌యం

అండ‌ర్ 19 వ‌ర‌ల్డ్ క‌ప్ విశ్వ విజేత

U19 ICC World Cup Comment : భార‌త క్రికెట్ రంగంలో అపురూప ఘ‌ట్టం ఆవిష్కృత‌మైంది. యువ‌త త‌లుచుకుంటే సాధ్యం కానిది ఏదీ లేద‌ని నిరూపించారు ఆడ‌బిడ్డ‌లు. కొత్త సంవ‌త్స‌రంలో అరుదైన ఘ‌న‌త‌ను సాధించారు.

అద్బుత‌మైన విజ‌యాన్ని న‌మోదు చేశారు. క‌లిసిక‌ట్టుగా ఆడితే స‌క్సెస్ త‌ప్ప‌క వ‌శం అవుతుంద‌ని నిరూపించారు. ప్ర‌త్యేకించి మ‌హిళా క్రికెట్ లో ఇదే తొలి అంత‌ర్జాతీయ ట్రోఫీ కావడం విశేషం. ఆడ‌పిల్ల‌లు స‌మాజంలో కూడా భాగ‌మ‌ని, వారిని వెన్నుత‌ట్టి ప్రోత్స‌హిస్తే అద్భుత‌మైన ఫ‌లితాలు సాధించ‌డం ఖాయ‌మ‌ని రుజువు చేశారు.

స‌మున్న‌త భార‌తావ‌ని ఇవాళ ఆడ‌బిడ్డ‌లు సాధించిన ఈ గెలుపును చూసి గ‌ర్విస్తున్న‌ది. ఆనంద ప‌డుతున్న‌ది. స‌గ‌ర్వంగా త‌లెత్తుకుని నిల‌బ‌డింది.

భార‌త జాతీయ త్రివ‌ర్ణ పతాకం రెప రెప లాడుతున్న‌ది నింగిలో. ట్రోఫీ సాధించ‌డం అంటే మామూలు విష‌యం కాదు. రేయింబ‌వ‌ళ్లు శ్ర‌మిస్తే కానీ ఈ స‌క్సెస్ ద‌క్క‌లేదు. 

ప్ర‌పంచ క‌ప్ ను గెలుపొందిన వెంట‌నే భార‌త మ‌హిళా క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ ష‌ఫాలీ వ‌ర్మ క‌న్నీళ్ల‌ను(U19 ICC World Cup) ఆపుకోలేక పోయింది. సంతోషం ప‌ట్ట‌లేక భావోద్వేగానికి లోనైంది.

ఈ విజ‌యం మ‌మ్మ‌ల్ని ఆశీర్వ‌దించిన భార‌త దేశానికి అంకిత‌మ‌ని ప్ర‌కిటించారు ష‌ఫాలీ వ‌ర్మ‌. సంతోషం ప‌ట్ట‌లేక దక్షిణాఫ్రికా లోని మైదానం అంత‌టా త్రివ‌ర్ణ ప‌తాకం ధ‌రించి తిరిగారు.

సామాజిక మాధ్య‌మాల‌లో ట్రెండింగ్ లో కొన‌సాగుతోంది. భార‌త దేశ క్రీడా చ‌రిత్ర‌లో చిర‌స్మ‌ర‌ణీయ‌మైన విజ‌యంగా నిలిచి పోతుంద‌న‌డంలో సందేహం లేదు. ఒక ర‌కంగా ఐసీసీని కైవ‌సం చేసుకోవ‌డంతో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ, రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము , త‌దితర ప్ర‌ముఖులు పెద్ద ఎత్తున ప్ర‌శంస‌లు కురిపించారు.

టీ20 ప్ర‌పంచ క‌ప్ విజ‌యంతో 16 ఏళ్ల రికార్డు బ‌ద్ద‌లు కొట్టారు ఆడ‌బిడ్డ‌లు. ధోనీ స‌ర‌స‌న టీమిండియా కెప్టెన్ షెఫాలీ వ‌ర్మ సార‌థ్యంలో టీ20 ఐసీసీ వ‌ర‌ల్డ్ క‌ప్ ను కైవ‌సం చేసుకుంది.

అంత‌కు ముందు మిథాలీ రాజ్ కెప్టెన్సీలో భార‌త సీనియ‌ర్ మ‌హిళ‌ల జ‌ట్టు 2005, 2017 లో వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఫైన‌ల్ లో ఆడారు. అలాగే హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ కెప్టెన్సీ లో టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఆడింది.

కానీ ప్ర‌పంచ క‌ప్ ను మాత్రం ముద్దాడ‌లేక పోయారు. ఇప్పుడు ఆ లోటును షెఫాలీ వ‌ర్మ తీర్చింది. ఇక ఈ టోర్నీలో షెఫాలీ వ‌ర్మ కెప్టెన్ గా(U19 ICC World Cup) రాణించింది. ఓపెన‌ర్ శ్వేత అత్య‌ధిక బ్యాట‌ర్ గా నిలిచింది. ఏడు మ్యాచ్ ల్లో 297 ర‌న్స్ చేసింది. 

ఇక స్పిన్న‌ర్లు అద్భుతాలు చేశారు. అన్ని మ్యాచ్ ల్లోనూ నిల‌క‌డ‌గా వికెట్లు తీస్తూ విజ‌యాల్లో కీల‌క పాత్ర పోషించారు. మ‌న్న‌త్ , అర్చ‌న అద్బుతమైన బౌలింగ్ తో ఆక‌ట్టుకున్నారు. ద‌క్షిణాఫ్రికాలో జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్ లో ప్ర‌త్య‌ర్థి ఇంగ్లండ్ ను 68 ప‌రుగుల‌కే క‌ట్ట‌డి చేసింది.

 14 ఓవ‌ర్ల‌లో 3 వికెట్లు కోల్పోయి టార్గెట్ ఛేదించింది. 7 వికెట్ల తేడాతో ఓడించి చ‌రిత్ర సృష్టించింది. ఏది ఏమైనా ఈ విజ‌యం.. అపురూపం..అమోఘం..ఆడ‌బిడ్డ‌లు ప్ర‌ద‌ర్శించిన స్పూర్తి నేటి యువ‌త‌కు ఆద‌ర్శం కావాలి.

Also Read : భార‌త మ‌హిళా జ‌ట్టు డ్యాన్స్ అదుర్స్

Leave A Reply

Your Email Id will not be published!