UAE T20 League 2023 : యూఏఈ టీ20 లీగ్ షెడ్యూల్ ఖరారు
వచ్చే జనవరి 6న టోర్నీ ప్రారంభం
UAE T20 League 2023 : ప్రపంచ క్రికెట్ లో ఎప్పుడైతే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్) ఎప్పుడైతే ప్రారంభించిందో ఆనాటి నుంచి టీ20 ఫార్మాట్ కు ఎనలేని డిమాండ్ పెరిగింది.
ప్రపంచంలోనే ఇప్పుడు ఐపీఎల్ రిచెస్ట్ లీగ్ గా నిలిచింది. తాజాగా అగ్రరాజ్యం అమెరికాలో కూడా క్రికెట్ కు జనాదరణ పెరుగుతోంది. ఇందులో బిగ్ కంపెనీలు పెట్టుబడిగా పెట్టాయి.
ఇక అరబ్ దేశాలలో క్రికెట్ కు ప్రయారిటీ ఇస్తుండడంతో టీ20 లీగ్(UAE T20 League 2023) లు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు ఆధ్వర్యంలో జరిగే యూఏఈ టీ20 లీగ్ చేపట్టాలని డిసైడ్ అయ్యింది.
ఈ మేరకు లీగ్ షెడ్యూల్ ఖరారైంది. ఈ రిచ్ లీగ్ 2023 జనవరి 6 నుంచి ప్రారంభం అవుతుంది. అదే ఏడాది ఫిబ్రవరి 12న జరిగే ఫైనల్ తో ముగుస్తుంది. ఇందులో మొత్తం 6 జట్లు పాల్గొంటున్నాయి.
వీటిలో 5 జట్లు ఏకంగా భారత క్రికెట్ కు చెందిన జట్లే ఉండడం విశేషం. ఈ ఐదింటిని యూఏఈ కొనుగోలు చేసింది.
ఇండియన్ ప్రిమీయర్ లీగ్(UAE T20 League 2023) లో భాగమైన ముంబై ఇండియన్స్ , కోల్ కతా నైట్ రైడర్స్ , ఢిల్లీ క్యాపిటల్స్ యజమానులైన రిలయన్స్ ఇండస్ట్రీస్ , నైట్ రైడర్స్ గ్రూప్ , జీఎంఆర్ మూడు జట్లను ఎంచుకుంది.
అదానీ స్పోర్ట్స్ లైన్, క్యాపీ గ్లోబల్ కూడా భారతీయ కంపెనీలే ఉన్నాయి. మరో టీమ్ ను మాంచెస్టర్ యునైటెడ్ కు చెందిన లాన్సర్ క్యాపిటల్స చేజిక్కించుకుంది.
ఇప్పటికే యూఏఈ బోర్డకు ఐపీఎల్ ను సక్సెస్ ఫుల్ గా నిర్వహించింది. దీంతో తమ స్వంత లీగ్ ను భారీగా విజయవంతం చేయాలనే పట్టుదలతో ఉంది.
Also Read : ఆ ముగ్గురు బౌలర్లే నాకు ఆదర్శం