Uber CEO : ఉద్యోగుల‌ను ఉబెర్ తొల‌గించ‌నుందా

కాదంటున్న సంస్థ సిఇఓ

Uber CEO : ప్ర‌పంచ వ్యాప్తంగా దిగ్గ‌జ కంపెనీల‌న్నీ ఉద్యోగుల‌ను వ‌దిలించుకునే ప‌నిలో ప‌డ్డాయి. ఎప్పుడు ఎవ‌రిని వ‌ద్ద‌ని చెబుతారో తెలియ‌ని స్థితిలో ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. ఇప్ప‌టికే టెస్లా సిఇఓ, చైర్మ‌న్ ట్విట్ట‌ర్ ను టేకోవ‌ర్ చేసుకున్నాక తొలిసారిగా జాబ‌ర్స్ ను తొల‌గించేందుకు శ్రీ‌కారం చుట్టారు. ఇ

ప్ప‌టి వ‌ర‌కు 9 వేల మందికి పైగా ఉద్యోగుల‌ను సాగ‌నంపాడు. ఆ త‌ర్వాత ఫేస్ బుక్ నుంచి మారిన మెటా కంపెనీ 10 వేల ను తొల‌గించింది. గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫా కంపెనీ 10 వేల మందికి చెక్ పెట్టింది. ప్ర‌పంచ దిగ్గ‌జ లాజిస్టిక్ కంపెనీ అమెజాన్ సంస్థ ఏకంగా 18,000 మందిని తొల‌గించింది.

మైక్రో సాఫ్ట్ 10 వేల మందిని సాగ‌నంపింది. కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఇక దేశీయ కంపెనీలు జొమాటో కంపెనీ సైతం జాబ‌ర్స్ ను ఇంటికి పంపించింది. తాజాగా ప్ర‌ముఖ భార‌తీయ కంప‌నీ ఉబెర్ కూడా ఆ బాట‌లో న‌డుస్తుందా అన్న అనుమానం అంత‌టా వ్య‌క్తం అవుతోంది.

ఈ త‌రుణంలో ఉబెర్ సంస్థ సిఇఓ దారా ఖోస్రోషాహి(Uber CEO) కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం ఆస‌క్తిని రేపుతోంది. తాను కంపెనీ వ్యాప్తంగా ఎలాంటి తొల‌గింపుల‌ను ప్లాన్ చేయ‌డం లేద‌ని స్ప‌ష్టం చేశాడు. స్విట్జ‌ర్లాండ్ లోని దావోస్ లో జ‌రుగుతున్న ప్ర‌పంచ ఆర్థిక స‌ద‌స్సులో గురువారం మీడియాతో మాట్లాడారు ఉబెర్ సిఇఓ.

అయితే ఖ‌ర్చుల‌ను త‌గ్గించు కునేందుకు ఉబెర్ గ‌త కొంత కాలం నుంచి ప్ర‌య‌త్నాలు చేస్తూ వ‌చ్చింద‌ని చెప్పారు. సిఇఓ చేసిన ఈ కామెంట్స్ తో ఉబెర్ సంస్థ ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు.

Also Read : షేర్ చాట్ లో ఉద్యోగులపై వేటు

Leave A Reply

Your Email Id will not be published!