Rakesh Tikait : ఉదయ్ పూర్ ఘటన బాధాకరం – తికాయత్
బీజేపీ ప్రభుత్వం లేక పోతే ఇలాంటివి సహజం
Rakesh Tikait : కేంద్రంలో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీపై షాకింగ్ కామెంట్స్ చేశారు భారతీయ కిసాన్ యూనియన్ అగ్ర నాయకుడు రాకేశ్ తికాయత్. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాజస్తాన్ లోని ఉదయ్ పూర్ దర్జీ ఘటనపై స్పందించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సూచించారు.
అయితే బీజేపీ అధికారంలో లేక పోతే మరిన్ని జరిగే ప్రమాదం లేక పోలేదంటూ హెచ్చరించారు. ఆ పార్టీ గనుక ఆయా రాష్ట్రాలలో లేక పోతే ఇలాంటి ఘటనలు మరింత పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇప్పటికే ఒకే దేశం ఒకే పార్టీ ఒకకే చట్టం అన్న రీతిన వ్యవహరిస్తోందంటూ ఆరోపించారు. కేవలం దర్జీ మీదే ఆధారపడి బతుకుతున్న వ్యక్తిని దారుణంగా హత్య చేయడం,
ఆపై వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం బాధాకరమని పేర్కొన్నారు రాకేశ్ తికాయత్(Rakesh Tikait). ఇలాంటి విపరీతమైన పోకడలు సమాజానికి మంచిది కాదని స్పష్టం చేశారు.
హింస ఎన్నటికీ ఆమోద యోగ్యం కాదన్నారు. తాము దేశ వ్యాప్తంగా జరిపిన ఆందోళనలో ఎలాంటి హింసకు పాల్పడలేదని గుర్తు చేశారు ఈ సందర్భంగా రాకేశ్ తికాయత్. దోషులు ఎవరైనా సరే వారిని కఠినంగా శిక్షించాలని సూచించారు.
ప్రజాస్వామ్యంలో స్వేచ్చ అన్న దానిని ఇలాంటి వాటికి ఉపయోగించడం మంచి పద్దతి కాదన్నారు. అందరినీ సమానంగా చూడడం, వ్యక్తిగత దూషణలకు దిగక పోవడం అన్నది ప్రధానంగా ఆయా పార్టీలు తమ నేతలకు బోధించాలని సూచించారు రాకేశ్ తికాయత్.
వ్యక్తిగత ద్వేషం ఎన్నటికీ మంచిది కాదని పేర్కొన్నారు.
Also Read : రేపే సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణం