Uddhav Thackeray : పవర్ పాలిటిక్స్ లో తప్పుకున్న ఠాక్రే
తండ్రికి తగ్గ వారుసుడిగా గుర్తింపు
Uddhav Thackeray : మరాఠా రాజకీయాలలో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ ను కలిగి ఉన్నారు శివసేన పార్టీ చీఫ్ ఉద్దవ్ ఠాక్రే. మహారాష్ట్రలో యోధుడిగా కీర్తించే బాలా సాహెబ్ ఠాక్రే వారసత్వం కంటిన్యూ చేస్తూ వస్తున్నారు.
కానీ పవర్ పాలిటిక్స్ లో సక్సెస్ కాలేక పోయాడు. సీఎంగా ఐదేళ్ల పాటు కొనసాగించ లేక పోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆయన మెతక వైఖరి, అనారోగ్యం, భార్య రశ్మీ ఠాక్రే, కొడుకు జోక్యం చేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
ఇక తిరుగుబాటు ప్రకటించిన శివసేన ఎమ్మెల్యేలు చేసిన ప్రధాన ఆరోపణ ఒక్కటే తమను పట్టించు కోలేదని. తమతో మాట్లాడిన దాఖలాలే లేవని. ఈ సమయంలో సీఎంగా కొలువు తీరిన ఉద్దవ్ ఠాక్రేకు అడుగడుగునా సమస్యలు ఎదురయ్యాయి.
ఓ వైపు కరోనా ఇంకో వైపు వరదలు, ఆర్థిక మాంద్యం, ఆపై అంతర్గత పోరు, ఇంకో వైపు కేంద్రం దాడులతో ఉక్కిరి బిక్కిరి అయ్యారు. చివరకు
నెంబర్ గేమ్, పవర్ పాలిటిక్స్ లో చక్రం తిప్పలేక పోయారు.
రాజకీయ చదరంగం నుంచి నిష్క్రమించారు. ఇక ఉద్దవ్ ఠాక్రే(Uddhav Thackeray) విషయానికి వస్తే ముంబైలో బాల్మోహన్ విద్యా మందిర్ లో చదువుకున్నారు.
జేజే నుండి డిగ్రీ చేశారు. 2002లో ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో శివసేన ఇంచార్జిగా తన రాజకీయ జీవితాన్నా ఠాక్రే ప్రారంభించారు.
2003లో శివసేన వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎంపికయ్యారు. 2006లో శివసేన పార్టీ మౌత్ పీస్ గా పేరొందిన సామ్నా పత్రికకు ప్రధాన సంపాదకుడిగా బాధ్యతలు స్వీకరించారు.
2019లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేంత వరకు ఉన్నారు. 2006లో రాజ్ ఠాక్రే కొంత కుంపటి పెట్టాడు. నవ నిర్మాణ సేన పేరుతో కొత్త పార్టీ పెట్టాడు. శివసేన పార్టీకి 2013లో అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.
2014లో మరాఠాలోని ఎన్డీఏ ప్రభుత్వంలో చేరాడు. శివసేన ఎన్డీయేతో విడి పోయి యూపీఏలో చేరింది. దీంతో ఉద్దవ్ ఠాక్రే ఇతర పార్టీలతో కలిసి మహా వికాస్ అఘాడిగా ఏర్పాటై ప్రభుత్వం ఏర్పాటు చేశారు.
చివరకు శివసేన పార్టీకి చెందిన వారే ఎదురు తిరగడంతో ప్రభుత్వం కూలి పోయింది. ఉద్దవ్ ఠాక్రే(Uddhav Thackeray) రెండున్నర ఏళ్ల పాటు పని చేసి తప్పుకున్నారు.
Also Read : ఫలించని రశ్మీ ఠాక్రే ప్రయత్నం