Uddhav Thackeray : శివ‌సేన చీఫ్ విప్ నుంచి షిండే తొల‌గింపు

ప్ర‌భుత్వానికి వ‌చ్చిన ప్ర‌మాదం ఏమీ లేదు

Uddhav Thackeray : మ‌హారాష్ట్ర‌లో సంక్షోభం కొన‌సాగుతోంది. ప్ర‌భుత్వంలో కీల‌క మంత్రిగా ఉన్న శివ‌సేన పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు ఏక నాథ్ షిండే ధిక్కార స్వ‌రం వినిపించారు.

ఆయ‌న‌తో పాటు 21 మంది ఎమ్మెల్యేల‌తో క‌లిసి గుజ‌రాత్ లోని సూర‌త్ హోట‌ల్ లో ఉన‌ట్లు స‌మాచారం. దీంతో ప్ర‌భుత్వం ఉంటుందా లేదా అన్న ఉత్కంఠ నెల‌కొంది.

ఈ త‌రుణంలో పార్టీ చీఫ్ విప్ గా ఉన్న ఏక్ నాథ్ షిండేను తొల‌గిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు శివ‌సేన చీఫ్‌, సీఎం ఉద్ద‌వ్ ఠాక్రే. మ‌రో వైపు ప‌రిస్థితి కుదుట ప‌డుతుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు ఎన్సీపీ చీఫ్ శ‌ర‌ద్ ప‌వార్.

శివ‌సేన‌తో పాటు కాంగ్రెస్ , ఎన్సీపీ క‌లిసి మ‌హా వికాస్ అఘాడీగా ఏర్ప‌డ్డాయి. సంకీర్ణ స‌ర్కార్ ను ఏర్పాటు చేశాయి. మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వానికి కేంద్రంలోని బీజేపీ స‌ర్కార్ కు మ‌ధ్య ప్ర‌త్య‌క్ష స్థాయిలో వార్ న‌డుస్తోంది.

ఈ త‌రుణంలో తాజాగా రాజ్య‌స‌భ‌, ఎమ్మెల్సీ ఎన్నిక‌లు జ‌రిగాయి. ఆరు రాజ్య‌స‌భ స్థానాల‌లో చెరో మూడు గెలుపొందాయి శివ‌సేన కూట‌మి, బీజేపీ.

ఇక శాస‌న‌మండ‌లి ఎన్నిక‌ల్లో 10 స్థానాల‌కు గాను 5 మ‌హా వికాస్ అఘాడీ 5 బీజేప చేజిక్కించుకున్నాయి. కాంగ్రెస్ అభ్య‌ర్థికి కోలుకోలేని షాక్ త‌గిలింది.

ఈ త‌రుణంలో మంత్రిగా ఉన్న ఏక్ నాథ్ షిండే వేరు కుంప‌టి పెట్ట‌డం క‌ల‌క‌లం రేపింది. ఇదిలా ఉండ‌గా షిండేపై కీల‌క కామెంట్స్ చేశారు ఉద్ద‌వ్ ఠాక్రే(Uddhav Thackeray) . బాలా సాహెబ్ మాకు హిందూత్వాన్ని నేర్పించారు.

ఆయ‌న ఆలోచ‌న‌లు ఎప్పుడూ ఇత‌రుల‌ను ఇబ్బంది పెట్టేవిగా ఉండ‌వు. మేలు చేకూర్చేలా ఉంటాయి. ఒక‌రి ప్ర‌లోభాల‌కు లొంగ‌వ‌న్నారు.

కాగా శివ‌సేన అంత‌ర్గ‌త వ్య‌వ‌హారమ‌ని పేర్కొన్నారు పవార్. షిండేతో తాము ఎవ‌రినీ గుజ‌రాత్ కు పంపించ‌మ‌న్నారు. ఒక‌వేళ కాద‌నుకుంటే ఆయ‌నే రావాల్సి ఉంటుంద‌న్నారు.

Also Read : కాశ్మీర్ లో న‌లుగురు ఉగ్ర‌వాదులు హ‌తం

Leave A Reply

Your Email Id will not be published!