UGC : యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ ( యూజీసి) కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. పెను మార్పులకు శ్రీకారం చుట్టింది. విద్యార్థులు చదువుకునేందుకు వీలుగా చర్యలు చేపట్టింది.
ఇప్పటి వరకు ఒక స్టూడెంట్ ఏదైనా కోర్సును పూర్తిగా స్వదేశంలో, లేదంటే విదేశాల్లో పూర్తి చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని యూజీసీ (UGC)కల్పిస్తోంది.
ఉన్నత విద్యా పరంగా ట్విన్నింగ్ డిగ్రీ, జాయింట్ డిగ్రీ, డ్యూయల్ డిగ్రీల కోర్సులకు ఛాన్స్ ఇస్తోంది. దీని వల్ల ఒకే డిగ్రీని మన దేశంతో పాటు ఇతర దేశాల్లో సైతం పూర్తి చేసే అవకాశం ఉంది.
వీటిని చదువుతున్న వారు తమ క్రెడిట్స్ ను ఒక దేశం నుంచి మరో దేశానికి బదిలీ చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించి రూల్స్ నిర్దేశించింది. మార్గదర్శకాలు జారీ చేసింది యూజీసీ(UGC).
ఇందులో భాగంగా దేశంలోని విద్యా సంస్థలు, వర్సిటీలు న్యాక్ గ్రేడింగ్ లో స్కోర్ సాధించాల్సి ఉంటుంది. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ లో 100 లోపు ఉండాలని స్పష్టం చేసింది.
ఇందులో ఉన్న సంస్థలకే ఇంటర్నేషనల్ గల విద్యా సంస్థలతో ఒప్పందాలు చేసుకోవచ్చు. ఇందుకు యూజీసీ పర్మిషన్ అక్కర్లేదని తెలిపింది. ఇక విదేశీ సంస్థలు 500 లోపు ఉండాలి.
ఇదే సమయంలో ఆన్ లైన్ , ఓపెన్ , డిస్టెన్స్ లెర్నింగ్ పద్దతిలో చదివేందుకు పర్మిషన్ ఇవ్వమని యూజీసీ స్పష్టం చేసింది. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లవచ్చు.
విదేశీ విద్యార్థులు స్వదేశంలోకి రావచ్చు. ఇందు వల్ల అంతర్జాతీయ పరంగా గుర్తింపు విద్యార్థులకు లభిస్తుంది. ఈ విషయాన్ని యూజీసీ చైర్మన్ జగదీశ్ కుమార్ వెల్లడించారు.
Also Read : ఒకేసారి రెండు డిగ్రీలు చదివేందుకు ఓకే