Ukraine Women : ఓ వైపు బాంబుల మోత. ఇంకో వైపు మిస్సైళ్ల దాడులు. ఉక్రెయిన్ లో ఎటు చూసినా రష్యా దళాలే కనిపిస్తున్నాయి. వేలాది మంది ఉక్రెయిన్లు బతుకు జీవుడా అంటూ బంకర్లలో, మెట్రో స్టేషన్లలో, ఇతర ప్రాంతాలలో తలదాచుకుంటున్నారు.
ఇంకొందరు ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని సరిహద్దుల్లోకి పెట్టే బేడా సర్దుకుని వెళుతున్నారు. ఇలాంటి అమానీయ ఘటనలు, దృశ్యాలు ఇప్పుడు సర్వ సాధారణంగా మారాయి.
కానీ రష్యా రెచ్చి పోయినా, ఏకపక్షంగా దాడులకు తెగబడినా, నిప్పులు చిమ్మినా ఒక్కడు మాత్రం వెరవడం లేదు. అతడే ఉక్రెయిన్ దేశానికి అధ్యక్షుడు జెలెన్స్కీ. చావనైనా చస్తా కానీ లొంగి పోయే ప్రసక్తి లేదంటున్నాడు.
ఇదే ధీరత్వాన్ని, ధైర్యాన్ని ఆ దేశ ప్రజలు కూడా ఎలుగెత్తి చాటుతున్నారు. తాజాగా ప్రపంచాన్ని కదిలించిన సన్నివేశం ఇప్పుడు వైరల్ గా మారింది. ఉక్రెయిన్ కు చెందిన ఓ మహిళ(Ukraine Women) వెళుతున్న సమయంలో రష్యా దళాలు అడ్డుకునే ప్రయత్నం చేశాయి.
దీంతో ఆమె ఎక్కడా భయం అన్నది లేకుండా అసలు మీరు ఎవరు. ఈ భూమి మాది. దీనిపై మీకు హక్కు ఎవరిచ్చారు. మీకు మాకు ఏం సంబంధం అంటూ నిలదీసింది. దీంతో రష్యా సైనికులు ఆమె వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పోయారు.
తుపాకులు చేతుల్లో ఉన్నా ఏమీ చేయలేక పోయారు. మేం ఏం నేరం చేశామని మాపై దాడులకు దిగుతున్నారు. ఇది న్యాయమేనా. మీకైనా అనిపించడం లేదా అని నిలదీసింది.
హెనిచెస్క్ లోని వీధుల్లోకి వచ్చిన వారికి ఉక్రెయిన్ మహిళ ఉక్కు మహిళ ధీటుగా జవాబు ఇచ్చింది. ధైర్యంగా దమ్ముంటే కాల్చండంటూ సవాల్ విసిరింది.
Also Read : మహిమా దాట్లకు అరుదైన గౌరవం