Umair Sandhu : ఆది పురుష్ పై ఉమైర్ సంధు కామెంట్స్
ఆ మూడు సినిమాలతో ప్రభాస్ అవుట్
Umair Sandhu : ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా నటుడు ప్రభాస్ , అందాల ముద్దుగుమ్మ కృతీ సనన్ కలిసి నటించిన రామాయణం ఇతిహాసం ఆధారంగా తీసిన ఆది పురుష్ ప్రపంచ వ్యాప్తంగా జూన్ 16 శుక్రవారం విడుదలైంది. మొదట్లో పాజిటివ్ టాక్ వచ్చినా ఆ తర్వాత కొంత నెగటివ్ ప్రచారం జరుగుతోంది. టికెట్లు మాత్రం భారీగా అమ్ముడు పోయాయి. మొదటి రోజే భారీ కలెక్షన్లు కొల్లగొట్టింది. కానీ కథ, చిత్రీకరణ పూర్తిగా అంతగా ఆకట్టుకోలేదని సినీ పండితులు పేర్కొంటున్నారు.
తాజాగా ట్విట్టర్ వేదికగా మోస్ట్ పాపులర్ సినీ అనలిస్ట్, క్రిటిక్ గా పేరు పొందిన ఓవర్సీస్ సెన్సార్ బోర్డు మెంబర్ ఉమైర్ సంధు(Umair Sandhu) సంచలన కామెంట్స్ చేశారు. ఆది పురుష్ పూర్తిగా నిరాశ పరిచిందంటూ పేర్కొన్నారు. అంచనాలకు దగ్గరగా కూడా రాలేక పోయిందని స్పష్టం చేశారు ఉమైర్ సంధు.
ఇదిలా ఉండగా గ్రాఫిక్స్ తప్పా ఆది పురుష్ లో ఏముందని ప్రశ్నించారు. అసలు రామాయణం ఇతిహాసాన్ని దర్శకుడు ఓం రౌత్ చదివాడా అంటూ అనుమానం వ్యక్తం చేశాడు సంధు. ఇదిలా ఉండగా బ్యాక్ టు బ్యాక్ 3 మెగా డిజాస్టర్స్ మూవీస్ అంటూ ఎద్దేవా చేశాడు. సాహూ, రాధే శ్యామ్ , ఆది పురుష్ సినిమాలు ప్రభాస్ కెరీర్ లో అత్యంత ఫెయిల్యూర్ గా మిగిలి పోయాయని పేర్కొన్నాడు. జీరో యాక్టింగ్ స్కిల్స్ , ఎక్స్ ప్రెషన్స్ అంటూ ఎద్దేవా చేశాడు ఉమైర్ సంధు.
Also Read : Bandi Sanjay : జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి