Sourav Ganguly : ఉమ్రాన్ మాలిక్ అత్యుత్తమ బౌలర్ – గంగూలీ
జమ్మూ కాశ్మీర్ స్టార్ పేసర్ కు దాదా కితాబు
Sourav Ganguly : భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చైర్మన్ , సిఇఓ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly)సంచలన కామెంట్స్ చేశాడు. జమ్మూ కాశ్మీర్ కు చెందిన స్టార్ ఫాస్ట్ బౌలర్ గా ఇప్పటికే పేరు తెచ్చుకున్న ఉమ్రాన్ మాలిక్ ను ఆకాశానికి ఎత్తేశాడు.
గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఏకంగా 5 వికెట్లు తీశాడు. ప్రతి మ్యాచ్ లో తనకు తాను ప్రూవ్ చేసుకుంటూ దుమ్ము రేపుతున్నాడు. ఇప్పటి వరకు గంటకు 153 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తూ ఐపీఎల్ లో దూసుకు పోతున్నాడు.
అతడిని భారత జట్టుకు తీసుకోవాలని మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ , కేరళ ఎంపీ శశి థరూర్ డిమాండ్ చేశారు. ఈ తరుణంలో బీసీసీఐ చీఫ్ శనివారం ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
తాను ఐపీఎల్ లో అన్ని మ్యాచ్ లు చూస్తున్నానని కానీ ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ చేస్తున్న తీరు తనను ఎంతగానో ఆకట్టుకుందన్నాడు. ఈ ఐపీఎల్ లో అతడే అత్యుత్తమ బౌలర్ అని పేర్కొన్నాడు.
ఐపీఎల్ మెగా వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ సిఇఓ కావ్య మారన్ ఏరికోరి ఎంచుకుంది ఉమ్రాన్ మాలిక్ ను. అంచనాలకు మించి రాణిస్తున్నాడు.
ఇప్పటి వరకు బ్యాటింగ్ లో జోస్ బట్లర్ , కేఎల్ రాహుల్ ఉండగా బౌలింగ్ లో కుల్దీప్ యాదవ్ , యుజ్వేంద్ర చహల్ టాప్ లో కొనసాగుతున్నారు.
అయినా ఉమ్రాన్ మాలిక్ సూపర్ అంటూ పేర్కొన్నాడు సౌరవ్ గంగూలీ. ఈసారి కొత్త జట్లు గుజరాత్ టైటాన్స్ , లక్నో సూపర్ జెయింట్స్ బాగా ఆడుతున్నాయంటూ కితాబు ఇచ్చాడు.
Also Read : ఉత్కంఠ పోరులో విజేత ఎవరో