Umran Malik : ఐపీఎల్ లో మోస్ట్ పాపులర్ బౌలర్ గా పేరొందాడు జమ్మూ కాశ్మీర్ కు చెందిన ఉమ్రాన్ మాలిక్(Umran Malik ). ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతున్నాడు.
గంటకు 153 కిలోమీటర్ల వేగంతో బంతుల్ని వేస్తున్న మాలిక్ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఎప్ప్పుడు ఏ రకంగా అటాకింగ్ చేస్తాడో తెలియక తలలు పట్టుకుంటున్నారు.
విచిత్రం ఏమిటంటే మిస్సైళ్ల కంటే వేగంగా బంతుల్ని వేస్తుండడంతో కనీసం డిఫెన్స్ ఆడేందుకు జంకుతున్నారు. తాజాగా ఐపీఎల్ లో కంటిన్యూగా విజయాలు సాధిస్తూ వస్తున్న గుజరాత్ టైటాన్స్ ను దెబ్బ కొట్టాడు ఉమ్రాన్ మాలిక్(Umran Malik ).
జోరు సాగిస్తున్న వృద్దిమాన్ సాహాను బోల్తా కొట్టించాడు. 151 కిలోమీటర్ల వేగంతో వచ్చిన ఆ బాల్ వికెట్లను తాకింది. ఇక మ్యాచ్ లో భాగంగా 16వ ఓవర్ లో డేవిడ్ మిల్లర్ తో అభినవ్ శర్మను క్లీన్ బౌల్డ్ చేశాడు.
మొత్తం 4 ఓవర్లు వేసిన ఉమ్రాన్ మాలిక్ ఏకంగా 5 వికెట్లు పడగొట్టాడు. దీంతో ప్రత్యర్థి జట్టు గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించినా మాలిక్ అద్భుతమైన బౌలింగ్ తో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.
ఒక రకంగా గుజరాత్ ప్లేయర్లకు చుక్కలు చూపించాడు మాలిక్. అత్యంత వేగంగా బంతుల్ని విసిరే బౌలర్ గా పేరున్న ఉమ్రాన్ మాలిక్ ఇప్పుడు ఐపీఎల్ లో హాట్ టాపిక్ గా మారాడు.
బెంగళూరు వేదికగా జరిగిన వేలం పాటలో అతడిని ఏరికోరి చేజిక్కించుకుంది సన్ రైజర్స్ హైదరాబాద్. మొత్తంగా మ్యాచ్ ఓడినా మాలిక్ మాత్రం హీరోగా మిగిలి పోయాడు.
Also Read : గుజరాత్..హైదరాబాద్ బిగ్ ఫైట్