Umran Malik : ఉమ్రాన్ మాలిక్ కు ఘన స్వాగతం
సెల్ఫీలు దిగేందుకు పలువురు పోటీ
Umran Malik : జమ్మూ కాశ్మీర్ కు చెందిన స్టార్ ప్లేయర్, పేసర్ ఉమ్రాన్ మాలిక్ కు ఘన స్వాగతం లభించింది. ఈ స్పీడ్ పేసర్ ఈసారి జరిగిన ఇండియన్ ప్రిమీయర్ లీగ్ 2022లో దుమ్ము రేపాడు.
సన్ రైజర్స్ హైదరాబాద్ ఏరి కోరి ఎంచుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 12, 13 తేదీలలో బెంగళూరు వేదికగా జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం సిఇఓ కావ్య మారన్ దక్కించుకుంది.
యాజమాన్యం తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయలేదు. ఈ మెగా రిచ్ లో అత్యధికంగా వేగవంతంగా బౌలింగ్ చేశాడు. దేశ వ్యాప్తంగా అభిమానాన్ని, ఆదరణను చూరగొన్నాడు ఉమ్రాన్ మాలిక్(Umran Malik).
అతడి మిస్సైల్ లాంటి బంతుల్ని ఆడేందుకు ప్రత్యర్థి జట్ల ఆటగాళ్లు నానా తంటాలు పడ్డారు. దీంతో అద్భుతంగా బౌలింగ్ చేస్తూ ముప్పు తిప్పలు పెడుతున్న మాలిక్ ను జాతీయ జట్టుకు తీసుకోవాలని పెద్ద ఎత్తున డిమాండ్ రేగింది.
వీరిలో ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. వారిలో కేంద్ర మాజీ మంత్రి , కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి. చిదంబరం, కేరళ ఎంపీ శశి థరూర్ , తెలంగాణ ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్ సైతం ట్విట్టర్ వేదికగా బీసీసీఐని డిమాండ్ చేశారు.
దాంతో బీసీసీఐ సెలెక్షన్ కమిటీ టీ20టకి ఎంపిక చేసింది. ఇదిలా ఉండగా ఎస్ఆర్ హెచ్ ప్లే ఆఫ్స్ కు చేరకుండానే నిష్క్రమించింది. అయినా ఉమ్రాన్ మాలిక్(Umran Malik) కు ఆదరణ తగ్గలేదు.
ఐపీఎల్ నుంచి తన స్వస్థలానికి వచ్చిన ఉమ్రాన్ మాలిక్ కు ఘన స్వాగతం లభించింది. ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పలువురు పోటీ పడ్డారు.
Also Read : అరుదైన రికార్డుకు అడుగు దూరంలో