Umran Malik : జమ్మూ కాశ్మీర్ కు చెందిన ఉమ్రాన్ మాలిక్ ఇప్పుడు ఓ సెన్సేషన్. 153 కిలోమీటర్ల వేగంతో అతడు వేసే బంతుల్ని ఆడేందుకు బ్యాటర్లు నానా తంటాలు పడుతున్నారు. ప్రస్తుతం ముంబై వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2022లో అతడి గురించే చర్చ జరుగుతోంది.
2021లో సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం అతడిని ఏరికోరి తీసుకుంది. దుబాయి వేదికగా జరిగిన ఐపీఎల్ లో నెట్ బౌలర్ గా ఉన్నాడు. కానీ ఈసారి నటరాజన్ స్థానంలో వచ్చి దుమ్ము రేపుతున్నాడు.
ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్ లలో ఉమ్రాన్ మాలిక్ 9 వికెట్లు తీశాడు. అతడిని టీమిండియా జట్టులోకి తీసుకోవాలంటూ తాజా, మాజీ క్రికెటర్లే కాదు పొలిటికల్ లీడర్లు కూడా కోరుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు మనోడి సత్తా ఏంటోనని.
ఇప్పటికే గవాస్కర్ , రవిశాస్త్రితో పాటు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ , మంత్రి కేటీఆర్ సైతం ఉమ్రాన్ మాలిక్(Umran Malik) ను ఆకాశానికి ఎత్తేశారు. ఈ తరుణంలో ఉమ్రాన్ మాలిక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
తనకు తానే రోల్ మోడల్ నని పేర్కొన్నాడు. అంతే కాదు తన కల దేశానికి ప్రాతినిధ్యం వహించాలని చెప్పాడు. పనిలో పనిగా తనకు ఆ ముగ్గురు బౌలర్లు రోల్ మోడల్ అంటూ కితాబు ఇచ్చారు.
వారెవ్వరో కాదు మహ్మద్ షమీ, జస్ ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్ అని చెప్పాడు ఉమ్రాన్ మాలిక్(Umran Malik). ఇదిలా ఉండగా ఐపీఎల్ లో ఇప్పటి వరకు గంటకు 153 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరిన బౌలర్ ఎవరూ లేక పోవడం విశేషం.
జమ్మూ కాశ్మీర్ ప్రజలకు , దేశానికి పేరు తీసుకు వస్తానని తెలిపాడు మాలిక్.
Also Read : ఢిల్లీ షాన్ దార్ పంజాబ్ జోర్దార్