Umran Malik : ఆ ముగ్గురు బౌలర్లే నాకు ఆదర్శం
స్పష్టం చేసిన ఉమ్రాన్ మాలిక్
Umran Malik : భారత స్టార్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తాను వకార్ యూనిస్ ను అసుసరిస్తున్నట్లు వస్తున్న ప్రచారాన్ని కొట్టి పారేశాడు. తాజాగా స్వదేశంలో సౌతాఫ్రికా 5 మ్యాచ్ ల టీ20 సీరీస్ కు భారత జట్టు తరపున ఎంపికయ్యాడు ఉమ్రాన్ మాలిక్.
తాను ఆరాధించే బౌలర్ల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు. నెట్ ప్రాక్టీస్ మొదలు పెట్టిన ఈ స్టార్ పేసర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనను ముగ్గురు బౌలర్లు ప్రభావితం చేశారని చెప్పాడు.
వారిలో భువనేశ్వర్ కుమార్ , జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ అని వెల్లడించాడు. వారిని తాను చూస్తూ బౌలింగ్ లో మార్పులు చేసుకున్నానని , ఎలా బౌలింగ్ చేయాలి, ఎలా వికెట్లు పడగొట్టాలి.
మొదటి సెషన్ లో ఎలా బంతుల్ని విసరాలి, డెత్ బౌలింగ్ లో ఎలా కంట్రోల్ చేసుకోవాలనే దానిపై ఈ ముగ్గురి నుంచి తాను నేర్చుకున్నానని చెప్పాడు.
ఇదిలా ఉండగా తాజాగా ముగిసిన ఐపీఎల్ 2022లో 14 మ్యాచ్ లు ఆడాడు సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఉమ్రాన్ మాలిక్(Umran Malik). 22 వికెట్లు పడగొట్టాడు. టోర్నీలో 157 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసి రికార్డ్ సృష్టించాడు.
ఇదే సమయంలో ఫెర్గూసన్ సూపర్ బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు. ఈనెల 9 నుంచి సఫారీ జట్టుతో భారత్ మ్యాచ్ లు ఆడేందుకు రెడీ అవుతోంది. దీంతో బౌలింగ్ ప్రాక్టీస్ లో నిమగ్నం అయ్యాడు ఉమ్రాన్ మాలిక్.
కాగా ఆసిస్ మాజీ పేసర్ బ్రెట్ లీ మాట్లాడుతూ ఉమ్రాన్ వకార్ ను గుర్తు చేసుకున్నాడని తెలిపాడు. దీనిని తోసి పుచ్చాడు ఉమ్రాన్ మాలిక్(Umran Malik).
Also Read : పేర్లు ఫేమస్ ఆట తీరు బేవార్స్ – కపిల్ దేవ్