UN Chief Guterres : ఉక్రెయిన్ పై రష్యా ఏకపక్షంగా దాడి చేయడాన్ని యావత్ ప్రపంచం తీవ్రంగా ఖండిస్తోంది. పలు దేశాలు ఇప్పటికే రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించాయి.
అమెరికా సైతం కన్నెర్ర చేసింది. కానీ పుతిన్ ససేమిరా అంటున్నాడు. యుద్దం కానే కాదని తమను తాము రక్షించు కునేందుకు సాగుతున్న పోరాటంగా ఆయన అభివర్ణించాడు.
ఈ విషయంపై పూర్తి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఉక్రెయిన్ పై దాడి ఆపాలంటూ రష్యాలోని పీటర్స్ బర్గ్ వద్ద భారీ ఎత్తున ప్రదర్శనలు చేపట్టారు. అయినా కరగడం లేదు. కనికరించడం లేదు.
ఇంకో వైపు ఉక్రెయిన్ పై బాంబుల మోత మోగుతోంది. సైనిక విన్యాసాలు కొనసాగుతున్నాయి. మిస్సైళ్లు శరవేగంగా కదులుతున్నాయి. ఇప్పటి వరకు ఎంత మంది చని పోయారనేది సమాచారం లేదు.
ఈ తరుణంలో ఐక్య రాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్(UN Chief Guterres) స్పందించారు. తన జీవిత కాలంలో అత్యంత విషాదకరమైన సన్నివేశంగా మిగిలి పోతుందని పేర్కొన్నారు.
తనను ఎంతో బాధకు గురి చేసిందని ఆవేదన చెందారు. పదవీ కాలంలో అత్యంత బాధాకరమైన క్షణమంటూ వాపోయాడు. ఉక్రెయిన్ అంశంపై ఐరాస భద్రతా మండలి లో అత్యవసర సమావేశం జరిగింది.
పాల్గొన్న ప్రతి ఒక్కరు రష్యా దాడిని ఖండించారు. దయచేసి పుతిన్ కు విన్నవించుకుంటున్నా. ఉక్రెయిన్ పై దాడికి పంపిన మీ దళాలను వెనక్కి రప్పించండి.
ఈ మారణ హోమాన్ని నిలిపి వేయండని కోరారు. ఇప్పటికే చాలా మందిని పొట్టన పెట్టుకున్నారు. వారి ఆత్మలకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని తెలిపారు.
ఈ పరిణామాలు ఉక్రెయిన్ కు మాత్రమే కాదు ఈ యావత్ ప్రపంచానికి ఓ హెచ్చరిక లాంటిదని పేర్కొన్నారు.
Also Read : దాడి తప్ప దారి లేదు – పుతిన్