Un Stoppable NBK : ఎదురే లేదంటున్న‌ బాల‌య్య

అన్ స్టాప‌బుల్ విత్ ఎన్బీకే రికార్డ్

Un Stoppable NBK  : న‌ట సింహం బాల‌య్య బాబు ఏది చేసినా అది ఓ రికార్డే. అటు సినిమాల్లో త‌న‌కంటూ ఓ స్టైల్ ఏర్ప‌ర్చుకున్న బాల‌కృష్ణ ఇప్పుడు బుల్లి తెర‌పై కూడా త‌న‌కు ఎదురే లేద‌ని చాటుతున్నాడు.

అల్లు అర‌వింద్, మై హోం రామేశ్వ‌ర్ రావు న‌డుపుతున్న ఆహాలో ఆయ‌న చేస్తున్న అన్ స్టాప‌బుల్ విత్ ఎన్బీకే(Un Stoppable NBK) రికార్డులు బ్రేక్ చేస్తోంది. ఇప్ప‌టికే ఎంద‌రినో ఆక‌ట్టుకుంటోంది ఈ ప్రోగ్రాం. భారీ రేటింగ్ వ‌చ్చింది.

టాలీవుడ్ కు చెందిన ప్ర‌ముఖులతో స‌ర‌దాగా మాట్లాడ‌టం. ప్ర‌శ్న‌ల‌తో తిక‌మ‌క పెట్ట‌డం, అవ‌స‌ర‌మైన స‌మ‌యంలో డైలాగులు పేల్చ‌డం, హాస్యాన్ని పండించ‌డం, వీలైతే వారితో క‌లిసి డ్యాన్సు కూడా చేయ‌డంతో బాల‌కృష్ణ ఇప్పుడు బుల్లి తెర‌పై హాట్ టాపిక్ గా మారాడు.

ఇప్పుడు మ‌రో అరుదైన రికార్డు స్వంతం చేసుకుంది ఈ ప్రోగ్రాం. ఆహా ఓటీటీలో అంచ‌నాల‌ను మించి ఆద‌ర‌ణ‌కు నోచుకుంది ఈ ప్రోగ్రాం.

ఈ షో చూసిన వారంతా బాల‌య్య బాబు ఫ్యాన్స్ గా మారి పోయారు. తాజాగా ఐఎండీబీలో ఏకంగా 9.8 రేటింగ్ తో టాప్ లో దూసుకు పోయింది. దేశ వ్యాప్తంగా ఇప్పుడు బాల‌య్య బాబు హాట్ టాపిక్ గా మారారు.

ఇదిలా ఉండగా ఈ షో 10 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. మొద‌టి సీజ‌న్ కూడా పూర్త‌యింది. ఇక రెండో సీజ‌న్ ఉంటుంద‌ని స‌మాచారం. న‌ట సింహం ఉంటాడా లేక వేరే వారిని తీసుకు వ‌స్తారా అన్న‌ది వేచి చూడాల్సి ఉంది.

40 కోట్ల స్ట్రీమింగ్ నిమిషాల‌తో ఆహా ఓటీటీ ప్లాట్ పాంలోనే అత్య‌ధికంగా తిల‌కించిన రియాల్టీ షోగా చ‌రిత్ర సృష్టించడం విశేషం.

Also Read : 14న ‘స‌ర్కారు వారి పాట’ అప్ డేట్

Leave A Reply

Your Email Id will not be published!