IPL 2020 Auction : షారుఖ్ ఖాన్ ..త్రిపాఠి పంట పండింది

భారీ ధ‌ర‌కు అన్ క్యాప్డ్ ప్లేయ‌ర్లు

IPL 2020 Auction : బెంగ‌ళూరు వేదిక‌గా ఐపీఎల్ వేలం కొన‌సాగుతూనే ఉంది. ఇప్ప‌టి దాకా ఇషాన్ కిష‌న్ భారీ ధ‌ర‌కు అమ్ముడు పోయాడు. ఇక అన్ క్యాప్డ్ ఆట‌గాళ్లు షారుఖ్ ఖాన్ , రాహుల్ త్రిపాఠిల పంట పండింది.

ఆల్ రౌండ‌ర్లు దీప‌క్ చాహ‌ర్ , శార్దూల్ ఠాకూర్ , లాకీ ఫెర్గూ న్ , ప్రసిద్ధ కృష్ణ కు మంచి ధ‌రే ద‌క్కింది. అన్ క్యాప్డ్ ప్లేయ‌ర్లు ఖాన్, త్రిపాఠి, అభిషేక్ శ‌ర్మ , డెవాల్డ్ బ్రెవిస్ పెద్ద మొత్తంలో వేలం పాట‌లో(IPL 2020 Auction) ప‌లికారు.

ముంబై ఇండియ‌న్స్ రూ. 15. 25 కోట్ల‌కు ఇషాన్ కిష‌న్ ను చేజిక్కించుకుంది. ఇప్ప‌టి దాకా అత్య‌ధిక కొనుగోదారుడిగా నిలిచాడు. దీప‌క్ చాహ‌ర్ ను చెన్నై సూప‌ర్ కింగ్స్ రూ. 14 కోట్ల‌కు తీసుకుంది.

ఫెర్గుస‌న్ , ప్ర‌సిద్ద కృష్ణ‌ల‌ను గుజ‌రాత్ టైటాన్స్ , రాజ‌స్థాన్ రాయ‌ల్స్ రూ. 10 కోట్ల‌కు తీసుకున్నారు. స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ నికోల‌స్ పూరన్ ను రూ. 10. 75 కోట్ల‌కు తీసుకుంది. పూర‌న్ ను అంత ధ‌ర పెట్టి కొనుగోలు చేయ‌డం విస్తు పోయేలా చేసింది.

గ‌త ఐపీఎల్ లో నికోల‌స్ దుమ్ము రేపాడు. క్రునాల్ పాండ్యా, మిచెల్ మార్ష్ లు వేలం పాట జ‌రుగుతుండ‌గానే అప‌శ్రుతి చోటు చేసుకుంది.

శ్రీ‌లంక స్టార్ ప్లేయ‌ర్ , ఆల్ రౌండ‌ర్ వ‌నిందు హ‌స‌రంగాను రూ. 10.75 కోట్ల‌కు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగళూరు త‌న ఖాతాలో వేసుకుంది. ఆర్ఆర్ హెట్మెయిర్ , ప‌డిక్క‌ల్ ను తీసుకుంది .

ధ‌వ‌న్, ర‌బ‌డ పంజాబ్ కింగ్స్ తీసుకుంది. కేకేఆర్ శ్రేయ‌స్ అయ్య‌ర్ ను ద‌క్కించుకుంది.

Also Read : వేలంలో అయ్య‌ర్ టాప్ వార్న‌ర్ లాస్ట్

Leave A Reply

Your Email Id will not be published!