Union Budget 2024 : వ్యవసాయం అనుబంధ రంగాలకు పెద్దపీట వేసిన కేంద్ర బడ్జెట్

ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్....

Union Budget 2024 : కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయం, అనుబంధ రంగాలకు భారీగా కేటాయింపులు చేశారు. పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman).. వ్యవసాయానికి భారీగా కేటాయింపులు చేసినట్లు ప్రకటించారు. ముఖ్యంగా సేంద్రీయ వ్యవసాయంపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ. 1.52 లక్షల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. వచ్చే రెండేళ్లలో కోటి మంది రైతులు సేంద్రీయ వ్యవసాయంలోకి ప్రవేశించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వ్యవసాయంలో స్థిరమైన పద్ధతులు, డిజిటల్ మౌలిక సదుపాయాలు, ఉత్పత్తి పెంపుదలపై దృష్టి సారించామని.. ఆ దిశగా కార్యక్రమాలు చేపడతున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్ తెలిపారు.

Union Budget 2024 Updates

అంతేకాదు.. వాతావరణ పరిస్థితులను తట్టుకునే, అధిక దిగుబడినిచ్చే ఉద్యానవన పంటలకు సంబంధించి 109 కొత్త వంగడాలను ప్రభుత్వం విడుదల చేయనున్నట్లు నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) తెలిపారు. వ్యసాయ రంగానికి కేటాయించిన రూ. 1.52 లక్షల కోట్ల బడ్జెట్ గ్రామీణ ప్రాంతాల్లో అధునాతన వ్యవసాయ యంత్రాలను ఉపయోగించేలా ప్రోత్సహిస్తుందన్నారు. దీంతోపాటు.. రాష్ట్రాల భాగస్వామ్యంతో ప్రభుత్వం వ్యవసాయానికి డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ప్రోత్సహిస్తుందని ప్రకటించారు. ఇక గ్రామీణాభివృద్ధి కోసం రూ. 2.66 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వ్యవసాయ ఉత్పాదతకు పెంపొందించడానికి, వాతావరణాన్ని తట్టుకోగల రకాలను అభివృద్ధి చేయడానికి వ్యవసాయ పరిశోధన శాలను ఏర్పాటు చేయడంపై ప్రభుత్వం సమగ్ర సమీక్ష చేస్తుందన్నారు.

ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. నూనెగింజల ఉత్పత్తి కోసం ఒక వ్యూహాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. రైతుల ఆదాయం పెంచడం, వ్యవసాయ విలువను పెంచడం దిశగా ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల మద్దతుతో పంట అనంతర కార్యకలాపాలలో పెట్టుబడులను ప్రోత్సహించడం, పాడి రైతులకు సాధికారత, నానో-డిఎపిని అన్ని వ్యవసాయ-వాతావరణ మండలాలకు విస్తరించడం, 5 ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్కుల ఏర్పాటు, ఆక్వాకల్చర్‌ను ప్రోత్సహించడానికి బ్లూ ఎకానమీ 2.0 ప్రారంభం, ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన అమలును వేగవంతం చేయడం, PM-KISAN కింద 11.8 కోట్ల మంది రైతులకు ప్రత్యక్ష ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి.

మధ్యంతర బడ్జెట్ ప్రకారం.. 2024-25 బడ్జెట్‌లో వ్యవసాయానికి రూ. 1.25 కోట్లు లక్షల కోట్లు కేటాయించారు. The PM-KISAN 60,000 కోట్లు ఉన్నాయి. చిన్న రైతును దృష్టిలో ఉంచుకుని ఆధునిక వ్యవసాయ సాంకేతికతలను ప్రోత్సహించడంపై దృష్టి పెట్టారు. చిరు ధాన్యాలను పండించడం, స్టార్టప్‌లను ప్రోత్సహించడంపైనా ఫోకస్ పెట్టింది కేంద్ర ప్రభుత్వం. భారతదేశ వ్యవసాయ రంగం వారసత్వ సమస్యలలో కొట్టుమిట్టాడుతూనే ఉంది. ఇప్పటికీ దేశ జనాభాలో అధిక శాతం మంది ప్రజలు దీనిపైనే ఆధారపడి జీవిస్తున్నారు. అయినప్పటికీ, వ్యవసాయం సమర్థత లోపించి తక్కువ ఆదాయ వృత్తిగా మిగిలిపోయింది. వ్యవసాయ ఉపాధి అవకాశాలను సృష్టించడంతోపాటు వాణిజ్యీకరణ, వైవిధ్యీకరణ దిశగా పయనించాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. భారతదేశంలో.. ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం వాటా కాలక్రమేణా క్షీణిస్తోంది. ప్రస్తుతం ఇది 15% కంటే తక్కువగా ఉంది. పరిశ్రమలు, సేవల రంగాల అధిక వృద్ధి రేటు ఈ పతనానికి ప్రధానంగా దోహదపడింది. ఏదేమైనా, భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం ప్రాముఖ్యత సంఖ్యలకు మించి ఉంది. ఎందుకంటే దేశ జనాభాలో 70% పైగా గ్రామీణ ఆదాయంపై ఆధారపడి ఉన్నారు.

Also Read : Assembly Meeting KCR : కాంగ్రెస్ గెలిచిన తర్వాత మొదటిసారి అసెంబ్లీకి రానున్న కేసీఆర్

Leave A Reply

Your Email Id will not be published!