Eklavya Teachers : ఏక‌లవ్య బ‌డుల్లో పంతుళ్ల భ‌ర్తీ – నిర్మ‌లా

వెల్ల‌డించిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి

Eklavya Teachers : కేంద్ర ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో ఏక‌ల‌వ్య రెసిడెన్షియ‌ల్ పాఠ‌శాల‌లు న‌డుస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ఉన్న బ‌డుల్లో పెద్ద ఎత్తున టీచ‌ర్ , నాన్ టీచింగ్ స్టాఫ్ ఖాళీగా ఉన్నాయి. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. బుధ‌వారం పార్ల‌మెంట్ లో కేంద్ర ప్ర‌భుత్వానికి సంబంధించి కొత్త‌గా బ‌డ్జెట్ ను ప్ర‌వేశ పెట్టారు.

ఈ మేర‌కు సంచ‌ల‌న విష‌యం బ‌య‌ట పెట్టారు. 38 వేల టీచ‌ర్ పోస్టుల‌ను ఏక‌ల‌వ్య రెసిడెన్షియ‌ల్(Eklavya Teachers) బ‌డుల్లో భ‌ర్తీ చేస్తామ‌ని చెప్పారు. వీటిని రాబోయే మూడు సంవ‌త్స‌రాల కాలంలో భ‌ర్తీ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు నిర్మ‌లా సీతారామ‌న్. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 740 ఏక‌ల‌వ్య మోడ‌ల్ స్కూళ్లు ఉన్నాయ‌ని తెలిపారు. టీచ‌ర్ల భ‌ర్తీతో పాటు నాన్ టీచింగ్ స్టాఫ్ ను కూడా భ‌ర్తీ చేస్తామ‌న్నారు.

ఇందులో మూడున్న‌ర ల‌క్ష‌ల మంది విద్యార్థులు చ‌దువుకుంటున్నారు. స్కూళ్ల భ‌ర్తీతోపాటు ఇత‌ర రంగాల‌కు కూడా భారీ ఎత్తున నిధులు కేటాయిస్తున్న‌ట్లు తెలిపారు. మ‌త్స్య శాఖ‌కు రూ. 6 వేల‌కోట్లు, క్లీన్ ప్లాంట్ కార్య‌క్ర‌మానికి రూ. 2 వేల కోట్లు , ఎస్సీ వ‌ర్గాల‌కు రూ. 15 వేల కోట్లు, గిరిజ‌నుల అభివృద్దికి రూ. 15 వేల కోట్లు, రైల్వేల‌కు రూ. 2.04 ల‌క్ష‌ల కోట్లు కేటాయించిన‌ట్లు ప్ర‌క‌టించారు నిర్మ‌లా సీతారామ‌న్.

ఇదిలా ఉండ‌గా 2047 ల‌క్ష్యంగా ప‌థ‌కాల‌ను త‌యారు చేశామ‌ని చెప్పారు ఆర్థిక మంత్రి. సామాజిక భ‌ద్ర‌త‌, డిజిట‌ల్ పేమెంట్ల‌లో అభివృది సాధించామ‌ని తెలిపారు. ఇప్ప‌టి వ‌ర‌కు 150కి పైగా మెడిక‌ల్ కాలేజీల‌కు అనుమ‌తి ఇచ్చామ‌న్నారు నిర్మ‌లా సీతారామ‌న్.

Also Read : నీతి ఆయోగ్ మూడేళ్ల పాటు పొడిగింపు

Leave A Reply

Your Email Id will not be published!