Minister Pralhad Joshi : కాంగ్రెస్ పార్టీ పై భగ్గుమన్న కేంద్రమంత్రి ఘరమ్
కాంగ్రెస్ పార్టీ, చీఫ్ మల్లికార్జున్ ఖర్గేను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు...
Pralhad Joshi : కాంగ్రెస్ పార్టీపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి విరుచుకుపడ్డారు.. ఒకే కుటుంబం ఆధిపత్యం వహించే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రజాస్వామ్యం – వాక్ స్వేచ్ఛ గురించి మాట్లాడుతుండటం విడ్డూరం అంటూ ఫైర్ అయ్యారు.. కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు జైరామ్ రమేష్ చేసిన ట్వీట్ పై మండిపడ్డారు. ఈ రోజు మే 26 2025.. నేడు ప్రకటించని అత్యవసర పరిస్థితి@11.. అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ జైరామ్ రమేష్ పరోక్షంగా ట్వీట్ చేశారు. ప్రధానిగా మోదీ బాధ్యతలు స్వీకరించి 11 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జైరామ్ రమేష్ పరోక్షంగా ట్వీట్ చేశారు. దీనిపై స్పందిస్తూ ప్రహ్లాద్ జోషి(Pralhad Joshi) కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. ఈ సందర్భంగా గత కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు, తప్పిదాలను ఉదాహరణగా చూపిస్తూ.. పలు ప్రశ్నలు సంధిస్తూ.. కాంగ్రెస్ పార్టీ, చీఫ్ మల్లికార్జున్ ఖర్గేను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.
Pralhad Joshi Slams
ఒకే కుటుంబం ఆధిపత్యం వహించే పార్టీ ఇప్పుడు ప్రజాస్వామ్యం – వాక్ స్వాతంత్ర్యం గురించి మాట్లాడుతుండటం విడ్డూరం.
- దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చివేసేందుకు వందకు పైగా సార్లు ఆర్టికల్ 356ను దుర్వినియోగం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇదే.
- 1975లో, వ్యక్తిగత – రాజకీయ లాభం కోసం జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది – ప్రాథమిక హక్కులను నిలిపివేయడం, పౌరుల స్వేచ్ఛలను హరించడం.
- కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం అత్యవసర యుగం వ్యూహాలను గుర్తుకు తెస్తూ ఒక గ్యాగ్ ఆర్డర్ జారీ చేసింది.
- ఇప్పుడు, వారు పార్టీని విమర్శించే అభిప్రాయాలను వ్యక్తం చేసే జర్నలిస్టులను, న్యూస్ యాంకర్లను లక్ష్యంగా చేసుకుని అరెస్టు చేయడానికి ప్రయత్నిస్తున్నారు.’’ అంటూ ప్రహ్లాద్ జోషి కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
Also Read : AP Liquor Scam : నిందితుల కస్టడీ పై ఏసీబీ కోర్టు తీర్పును మే 29 కి వాయిదా..