Deputy CM Pawan : పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై కేంద్రమంత్రి కీలక ట్వీట్

కాగా ఇటీవల పవన్ కల్యాణ్ అనారోగ్యానికి గురయ్యారు...

Deputy CM Pawan : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇటీవల వైరల్ ఫీవర్‌తో ఇబ్బంది పడుతున్నారు. అయితే పవన్ త్వరగా కోలుకోవాలని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ సోషల్ మాధ్యమం ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నారు. అయితే దీనిపై స్పందిస్తూ పవన్ కల్యాణ్ రీ ట్వీట్ చేశారు. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్‌కు పవన్ కల్యాణ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ‘‘మీరు నాపై చూపిన సానుభూతి, విషెస్, మీ మాటలు నాకు అపారమైన శక్తినిచ్చాయి’’ అని పవన్ కల్యాణ్ రీ ట్వీట్ చేశారు.

Deputy CM Pawan Health Update

కాగా ఇటీవల పవన్ కల్యాణ్ అనారోగ్యానికి గురయ్యారు. ఆయన వైరల్ ఫీవర్‌తోపాటు స్పాండిలైటిస్‌తో బాధపడుతున్నారు. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం పవన్ విశ్రాంతి తీసుకుంటున్నారు. కొన్ని రోజుల క్రితం జరిగిన ఏపీ కేబినెట్ సమావేశానికి కూడా పవన్ కల్యాణ్ హాజరు కాలేదని సమాచారం. పవన్ అస్వస్థతకు గురయ్యారని తెలుసుకున్న జనసైనికులు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నారు.

Also Read : బీజేపీ, బీఆర్ఎస్ పై టీపీసీసీ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు

Leave A Reply

Your Email Id will not be published!