Gehraiyaan : దీపిక‌తో రొమాన్స్ చెప్ప‌లేని ఫీలింగ్

స్ప‌ష్టం చేసిన యాక్ట‌ర్ సిద్దాంత్ చ‌తుర్వేది

Gehraiyaan  : హిందీ సినిమాలో వ‌చ్చిన గ‌ల్లీ బాయ్ మూవీ ఓ సెన్సేష‌న్. ఇందులో న‌టుడిగా మంచి మార్కులు తెచ్చుకున్నాడు సిద్దాంత్ చ‌తుర్వేది. మ‌రోసారి మ‌నోడు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాడు.

ఎందుకంటే సీనియ‌ర్ న‌టిగా పాపుల‌ర్ అయిన దీపికా ప‌దుకొనేతో క‌లిసి న‌టించిన మూవీ ఇప్పుడు సిద్దంగా ఉంది. ఈనెల 11న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. క‌ర‌ణ్ జోహార్ స‌మ‌ర్ప‌ణ‌లో గెహ్ర‌యాన్(Gehraiyaan )రూపు దిద్దుకుంది.

ఇందులో కుటుంబంలో మ‌నుషుల మ‌ధ్య బంధాలు ఎలా ఉంటాయ‌నే దానిని బేస్ గా తీసుకుని దీనిని రూపొందించాడు ద‌ర్శ‌కుడు శ‌కున్ బ‌త్రా. కావాల్సినంత మ‌సాలా కూడా ఉంద‌ని పోస్ట‌ర్లు చూస్తే తెలుస్తుంది.

సిద్దాంత్ చ‌తుర్వేది, దీపికా ప‌దుకొనేతో పాటు అన‌న్య పాండే, ధైర్య క‌ర్వా ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు. వ‌చ్చే వారంలో విడుద‌ల అయ్యేందుకు సిద్దంగా ఉన్న మూవీ ప్ర‌మోష‌న్స్ లో చిత్ర బృందం బిజీగా ఉంది.

ఇదిలా ఉండ‌గా సిద్దాంత్ చ‌తుర్వేది దీపిక‌తో కొన్ని రొమాంటిక్ సీన్స్ లో న‌టించాడు. దీనిపై స్పందించాడు సిద్దాంత్ . ద‌ర్శ‌కుడు శ‌కున్ బ‌త్రా క‌థ చెప్పిన‌ప్పుడు ఆశ్చ‌ర్యం వేసింది.

ఎందుకంటే సీనియ‌ర్ న‌టితో రొమాన్స్ అంటే కొంచెం క‌ష్టం క‌దా. ఆలోచించా ఆమె ఇప్ప‌టికే ఎంద‌రితో న‌టించింది. మోస్ట్ పాపుల‌ర్ హీరోయిన్. అలాంటి వ్య‌క్తితో ఇలాంటి స‌న్నివేశాలంటే కొంత ఇబ్బందిక‌ర‌మే. కానీ నాకే ఎంగ్జ‌యిటీగా అనిపించింద‌న్నాడు.

న‌ట‌న‌లో భాగం కావ‌డంతో దీపికా ప‌దుకొనేతో రొమాన్స్ చెప్ప‌లేనంత ఫీలింగ్ క‌లిగించింద‌ని చెప్పాడు సిద్దాంత్ చ‌తుర్వేది. ఇక డైరెక్ట‌ర్ దృష్టిలో రొమాన్స్ అన్న‌ది భౌతికం కాదు అది భావోద్వేగంతో కూడుకుని ఉన్న‌ద‌ని చెప్ప‌డం త‌నను ఇంప్రెస్ చేసింద‌న్నాడు.

Also Read : మా ఆయ‌న ముస‌లోడు కాదు మ‌గాడు

Leave A Reply

Your Email Id will not be published!