Yogi CM : వీధుల్లో నమాజ్ బంద్ – యోగి

గీత దాటితే బుల్ డోజ‌ర్లు ఎంట్రీ

Yogi CM : యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఆయ‌న రెండోసారి యూపీ సీఎంగా కొలువు తీరాక కీల‌క నిర్ణ‌యాల‌తో పాటు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేస్తూ మ‌రింత వేడి రాజేస్తున్నారు.

దీంతో నేర‌స్తులు, అవినీతి, అక్ర‌మార్కులు యోగి పేరు చెబితే చాలు జ‌డుసుకుంటున్నారు.ఇటీవ‌లే విధుల్లో నిర్ల‌క్ష్యం వ‌హించినందుకు ఏకంగా పోలీసు ఉన్న‌తాధికారిపై వేటు వేశారు.

ఎవ‌రైనా సరే ఇబ్బందుల‌కు గురి చేసినా ప్ర‌భుత్వ కార్య‌క‌లాపాల‌కు భంగం క‌లించాల‌ని ప్ర‌య‌త్నం చేసినా ఊరుకోబోనంటూ వార్నింగ్ ఇచ్చారు సీఎం యోగి(Yogi CM).

ఇప్పుడు దేశంలో ఆయ‌న మోస్ట్ పాపుల‌ర్ సీఎంగా మారారు. ఆయ‌న తీసుకు వ‌చ్చిన బుల్ డోజ‌ర్ల ప్ర‌యోగం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అక్ర‌మార్కులు, ఆక్ర‌మ‌ణ‌దారులు ల‌బోదిబోమంటున్నారు.

ఇక ప్ర‌తిప‌క్ష పార్టీ స‌మాజ‌వ్ వాదీకి చుక్క‌లు చూపిస్తున్నారు. ఏ మాత్రం గ‌డ‌ప దాటితే కేసులు, అరెస్ట్ లు చివ‌ర‌కు ఎన్ కౌంట‌ర్లు కూడా చేయ‌మ‌ని ఆదేశాలు జారీ చేశారు. దీంతో గ‌తంలో హ‌వా చెలాయించిన వారంతా ఇప్పుడు గ‌ప్ చుప్ గా మారారు.

యోగి పేరు చెబితే చాలు త‌మ‌ను బ‌త‌క‌నిస్తే చాలు అంటూ వేడుకుంటున్నారు. ఏకంగా ప్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శిస్తూ స్వ‌చ్చందంగా పోలీస్ స్టేష‌న్ ల వ‌ద్ద లొంగి పోతున్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లోనే ఉంద‌న్నారు యోగి ఆదిత్యానాథ్‌.

తాము అధికారంలోకి వ‌చ్చాక గ‌తంలో రోడ్ల‌పై న‌వాజు చేసేవార‌ని కానీ ఇప్పుడు ఆ సీన్ లేద‌న్నారు. కేవలం మ‌సీదుల్లోనే చేయాల‌ని ఆదేశించామ‌న్నారు. ఇక లౌడ్ స్పీక‌ర్లు కూడా బంద్ చేయించామ‌ని చెప్పారు సీఎం(Yogi CM).

Also Read : రైతన్న‌ల ఆందోళ‌న‌కు మ‌ద్ధ‌తిచ్చాం

Leave A Reply

Your Email Id will not be published!