CM Yogi : ‘ఎస్పీ’ అవమానం యోగి ఆగ్రహం
రామచరితమానస్ పై వివాదం
CM Yogi Akhilesh : ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన సమాజవ్ వాది పార్టీ చీఫ్ , మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రామచరిత మానస్ పై వివాదం కొనసాగుతోంది. భారత దేశంలోని హిందూ సమాజాన్ని అవమానించేలా ఎస్పీ యత్నిస్తోందంటూ మండిపడ్డారు. అసెంబ్లీలో శనివారం సీఎం మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీ లేనిపోని ఆరోపణలు చేస్తూ అడుగడుగునా అడ్డంకులు కలిగిస్తోందంటూ ధ్వజమెత్తారు.
ఇతర మతాలకు సంబంధించి మత గ్రంథాలను , విశ్వాసాలను అవమానిస్తే ఏం జరుగుతుందని అని ప్రశ్నించారు యోగి ఆదిత్యానాథ్. తాజాగా యూపీ అసెంబ్లీలో తీవ్ర వివాదం చోటు చేసుకుంది. ఈ నెల ప్రారంభంలో లక్నోలో ముగిసిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సందర్భంగా భారత దేశంలో , ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందూ సమాజాన్ని అవమానించేందుకు పార్టీ ప్రయత్నిస్తోందంటూ యూపీ సీఎం(CM Yogi Akhilesh) సీరియస్ అయ్యారు.
సమాజ్ వాదీ పార్టీ తులసీ దాస్ జీ గురించి రామచరిత్ మానస్ వాగ్వాదాన్ని ప్రారంభించిందని అన్నారు సీఎం. కొంత మంది రామ్ చరత్ మానస్ ను చింపేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. అదే విషయం వేరే మతంలో జరిగే ఏం జరిగేదన్నారు. ఒక రకంగా ఎస్పీ కావాలని హిందువులను అవమానించడం తప్ప మరొకటి కాదన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు యోగి ఆదిత్యానాథ్.
రామాయణ ఇతిహాసం ఆధారంగా రూపొందించిన రామ్ చరిత్ మానస్ లో నిర్దిష్ట కులాలు , వర్గాలను లక్ష్యంగా చేసుకుని అవమానకరమన వ్యాఖ్యలు , వ్యంగ్యం తొలగించాలని సమాజ్ వాది పార్టీ నాయకుడు స్వామి ప్రసాద్ మౌర్య డిమాండ్ చేశారు.
Also Read : విద్వేషాలను ఎగదోస్తున్న బీజేపీ – సోనియా