US Elections 2024 : బైడెన్ తీసుకున్న నిర్ణయం ఆయనకి దేశంపై ఉన్న ప్రేమను చూపుతుందంటున్న ఒబామా

ఉక్రెయిన్‌ - రష్యా యుద్ధానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలను ఏకం చేశారన్నారు....

US Elections 2024 : వైట్ హౌస్ రేసు నుండి వైదొలగాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా(Barack Obama) ప్రశంసించారు. బైడెన్‌ తీసుకున్న నిర్ణయం దేశంపై ఆయనకున్న ప్రేమను చాటుతోందని ఒబామా వ్యాఖ్యానించారు. రెండోసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయనకు అన్ని అర్హతలు ఉన్నాయని.. అయినప్పటికీ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారంటే గొప్ప దేశభక్తుడని పేర్కొన్నారు. అధ్యక్షుడిగా బైడెన్‌ అంతర్జాతీయ వేదికపై అమెరికా గొప్పతనాన్ని ఇనుమడింపజేశారని, నాటోను పునరుజ్జీవింపజేసినట్లు తెలిపారు.

US Elections 2024…

ఉక్రెయిన్‌ – రష్యా యుద్ధానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలను ఏకం చేశారన్నారు. అయితే రానున్న రోజుల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయని, అధ్యక్ష అభ్యర్థి ఎంపికలో డెమొక్రటిక్ పార్టీ ఆచితూచి అడుగులు వేయాలని అప్రమత్తం చేశారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ని అధ్యక్ష బరిలో నిలపాలని ఆ పార్టీ ఆలోచిస్తున్నా.. ఒబామా ఈ అంశాన్ని లేవనెత్తకపోవడం, అభ్యర్థి ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని అనడం పార్టీలో చర్చనీయాంశం అవుతోంది. కమలా హారిస్‌ అభ్యర్థిత్వానికి బైడెన్‌ మద్దతు ప్రకటించగా.. ఒబామా మాత్రం ఇప్పటివరకు ఆమెకు మద్దతు ప్రకటించకపోగా.. కొత్త నామినీ ఎంపిక కోసం సరైన ప్రక్రియతో ముందుకురావాలని పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది.

ఒబామాను హారిస్‌కు మెంటార్‌గా చెబుతుంటారు. డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన మరో కీలక నేత నాన్సీ పెలోసీ సైతం కమలా హారస్‌కు మద్దతు ప్రకటించకపోవడంతో పార్టీలో అంతర్గత కుమ్ములాటలు జరుగుతున్నాయనే అనుమానాలు కలుగుతున్నాయి. 2007లో జిల్లా న్యాయవాదిగా పనిచేస్తూ.. అధ్యక్ష బరిలో నిలిచిన బరాక్ ఒబామాకు కమలా.. మద్దతు తెలిపారు. ఒబామా అధ్యక్షుడైన తర్వాత 2010లో ఆమె అటార్నీ జనరల్‌గా విధులు నిర్వహించారు.

Also Read : Minister Kishan Reddy : దేశ వ్యతిరేక శక్తులన్నీ బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాయి

Leave A Reply

Your Email Id will not be published!