US Firm Audit Adani Group : అదానీపై యుఎస్ కంపెనీ ఆడిట్
గ్రాంట్ థార్న్ టన్ నియామకం
US Firm Audit Adani Group : అమెరికాకు చెందిన రీసెర్చ్ సంస్థ హిండెన్ బర్గ్ కొట్టిన దెబ్బకు గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ విలవిల లాడుతోంది. దీని తర్వాత అదానీ సంస్థల షేర్లు భారీగా పడి పోతున్నాయి.
ఇక అదానీ కుబేరుల జాబితాలో 3వ స్థానం నుంచి 22వ స్థానానికి పడి పోయాడు. ఈ తరుణంలో సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ దాఖలైంది. విచారణకు కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ధర్మాసనాన్నే సభ్యులు ఎవరిని నియమించాలనేది సూచించాలని కోరింది. ఈ తరుణంలో మరో బిగ్ షాక్ తగిలింది దిగ్గజ సంస్థకు.
ఇదిలా ఉండగా ఆఫ్ షోర్ టాక్స్ హెవెన్ లను సక్రమంగా ఉపయోగించ లేదని , స్టాక్ మానిప్యులేషన్ జరిగిందని ఆరోపిస్తూ జనవరి 24న హిండెన్ బర్గ్ నివేదిక వెల్లడించింది. దీని నుంచి గట్టెక్కేందుకు అదానీ గ్రూప్ నానా తంటాలు పడుతోంది. దాంతో అదానీ గ్రూప్ తన స్టాక్ లు, బాండ్ లను దెబ్బ తీసిన షార్ట్ సెల్లర్ హిండెన్ బర్గ్ రీసెర్చ్ క్లెయిమ్ లను తిరస్కరించే ప్రయత్నంంలో కొన్ని కంపెనీల స్వతంత్ర ఆడిట్ ల(US Firm Audit Adani Group) కోసం అకౌంటెన్సీ సంస్థ గ్రాంట్ థార్న్ టన్ ను నియమించింది.
హిండెన్ బర్గ్ నివేదిక ఆఫ్ షోర్ టాక్స్ హెవెన్ లను సక్రమంగా ఉపయోగించ లేదని ,స్టాక్ మానిప్యులేషన్ జరిగిందని ఆరోపించిన నేపథ్యంలో తనను తాను రక్షించుకునేందుకు అదానీ గ్రూప్(US Firm Audit Adani Group) చేసిన మొదటి ప్రయత్నాన్ని ఈ నియామకం సూచిస్తుంది. ఇదిలా ఉండగా హిండెన్ బర్గ్ నివేదిక పూర్తిగా నిరాధారమైనదని అదానీ గ్రూప్ పేర్కొంది. కానీ తన షేర్ల పతనాన్ని నిలువరించ లేక పోయింది.
Also Read : మోదీ శక్తిని చూసి విస్తు పోయా – సిఇఓ