US Media Layoffs : యుఎస్ మీడియాలో ఉద్యోగాల కోత

నిన్న ఐటీ..ఈ కామ‌ర్స్..లాజిస్టిక్

US Media Layoffs : ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్ ప్ర‌పంచాన్ని తీవ్ర ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. ఇప్ప‌టికే ట్విట్ట‌ర్, గూగుల్ ఆల్ఫా టెక్ , మైక్రో సాఫ్ట్ , మెటా ఫేస్ బుక్ , అమెజాన్ , సిస్కో తదిత‌ర దిగ్గ‌జ కంపెనీల‌న్నీ భారీగా ఉద్యోగాలను తొల‌గించే ప‌నిలో పడ్డాయి. తాజాగా అంత‌ర్జాతీయ స్థాయిలో మీడియా రంగంలో కూడా కోత‌లు మొద‌ల‌య్యాయి.

యుఎస్ మీడియాలో సైతం ఆ జాడ్యం మొద‌లైంది. భారీ ఎత్తున జాబ్స్ తొల‌గించింది. వోక్స్ , ల్యాండ్ మార్క్ న్యూయార్క్ మ్యాగ‌జైన్ య‌జ‌మాని అయిన వోక్స్ మీడియా త‌న సిబ్బందిలో 7 శాతం మందిని తొల‌గిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. వోక్స్ తో పాటు సీఎన్ఎన్ , ఎన్బీసీ, ఎంఎస్ఎన్బీసీ , బ‌జ్ ఫీడ్ , త‌దిత‌ర దిగ్గ‌జ మీడియా సంస్థ‌లు కూడా సిబ్బందిని తొల‌గించేందుకు(US Media Layoffs) రెడీ అయ్యాయి.

ఇప్ప‌టికే ముహూర్తం ప్రారంభించాయి. దీంతో వాటి మీద ఆధార‌ప‌డి ప‌ని చేస్తున్న వారంతా ల‌బోదిబోమంటున్నారు. ఇక ఆర్థిక మాంద్యం భ‌యాల మ‌ధ్య ఈ శీతాకాలంలో వ‌రుస అవుట్ లెట్ లు తొల‌గింపుల‌ను ప్ర‌క‌టించ‌డంతో సీఎన్ఎన్ నుండి వాషింగ్ట‌న్ పోస్ట్ వ‌ర‌కు యుఎస్ మీడియా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

వోక్స్ , ది వెర్జ్ వెబ్ సైట్ ల ఓన‌ర్ , ల్యాండ్ మార్క్ న్యూయార్క్ మ్యాగ‌జైన్ , ఆన్ లైన్ ప్లాట్ ఫార‌మ్ ల య‌జ‌మాని వోక్స్ మీడియా త‌న సిబ్బందిలో భారీ కోత విధిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు సిబ్బందికి మెమో జారీ చేశారు వోక్స్ మీడియా సిఇఓ జిమ్ బాంకాఫ్. ఇక మిగ‌తా మీడియా సంస్థ‌లు మాత్రం ఎంత మందిని ప‌క్క‌న పెట్టాయ‌నే దానిపై ఇంకా క్లారిటీ ఇవ్వ‌లేదు.

Also Read : కంపెనీలు ప‌బ్లిష‌ర్స్ కు వాటా ఇవ్వాలి

Leave A Reply

Your Email Id will not be published!