Rana Ayyub US Senator : రాణా అయ్యూబ్ కు సెనేటర్ సపోర్ట్
అమెరికా అవార్డు పొందిన జర్నలిస్ట్
Rana Ayyub US Senator : భారతీయ జర్నలిస్ట్ రానా అయ్యూబ్ మరోసారి హాట్ టాపిక్ గా మారారు. ఆమెకు ఇటీవలే ప్రతిష్టాత్మకమైన పులిట్జర్ అవార్డు లభించింది. భారత దేశంలో మత పరమైన హింస, చట్ట విరుద్దమైన హత్యలు, ఇతర ప్రజా ప్రయోజనాల గురించి ధైర్యంగా నివేదించారంటూ కితాబు ఇచ్చారు అమెరికాకు చెందిన సెనేటర్.
పని ఉద్దేశంతో తన దేశం పట్ల ప్రేమ, దాని కోసం ఉన్న ఆదర్శాల ద్వారా నడుపబడుతోందని పేర్కొన్నారు డెమోక్రటిక్ పార్టీకి చెందిన సెనేటర్ పాట్రిక్ లీహి పేర్కొన్నారు. ఈ సందర్బంగా జర్నలిస్ట్ రానా అయ్యూబ్(Rana Ayyub) ను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు కితాబు ఇచ్చారు.
రాణా అయ్యూబ్ అత్యంత ధైర్యంగా తన వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తోందంటూ పేర్కొన్నారు. అంతే కాదు ఆన్ లైన్ పరంగా వేధింపులు ఎదుర్కొన్నారు. సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ కు గురయ్యారని కానీ ఎక్కడా రాణా అయ్యూబ్ వెనక్కి తగ్గలేదంటూ స్పష్టం చేశారు.
కానీ ఆమె ధైర్యంగా ప్రజల కోసం వారు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి రాస్తూనే ఉందని కొనియాడారు. ఆమెను రక్షించాల్సిన వారు మరింత ఒత్తిళ్లకు గురి చేస్తున్నారంటూ ఆరోపించారు. అయినా చోటు చేసుకున్న ప్రతి అంశాన్ని తన పాత్రికేయ వృత్తి ద్వారా బహిర్గతం చేస్తూనే ఉందని పేర్కొన్నారు పాట్రిక్ లీహి.
జర్నలిస్టులను రక్షించే కమిటీని ఉటంకిస్తూ లీహి మాట్లాడారు. 2022లో కనీసం 38 మందికి పైగా జర్నలిస్టులు చంప బడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. 294 మంది జైళ్లల్లో మగ్గుతున్నారని, 64 మంది ఎక్కడున్నారో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
వ్యక్తీకరణ స్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి మూల స్తంభమని అది లేనప్పుడు ప్రజాస్వామ్య రాజ్యానికి, నిరంకుశ పాలనకు మధ్య ఉన్న గీత చెరిగి పోతుందని అప్పుడు నియంతృత్వం రాజ్యం ఏలుతుందన్నారు.
Also Read : సౌదీలో యూనిఫాం తప్పనిసరి