US Singer Touches : మోదీ పాదాల‌ను తాకిన యుఎస్ గాయ‌ని

జ‌న గ‌ణ మ‌న పాడిన మేరీ మిల్ బెన్

US Singer Touches : అమెరికాకు చెందిన ప్ర‌ముఖ గాయ‌ని మేరీ మిల్ హాట్ టాపిక్ గా మారారు. ఆమె యుఎస్ లో మోస్ట్ పాపుల‌ర్ సింగ‌ర్ . భార‌త దేశానికి చెందిన ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ అమెరికాలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా మేరీ మిల్ బెన్ కు అరుదైన అవ‌కాశం ద‌క్కింది. విశ్వ క‌వి ర‌వీంద్ర నాథ్ ఠాగూర్ రాసిన జ‌న గ‌ణ మ‌న అధినాయ‌క జ‌య‌హే అన్న భార‌త జాతీయ గీతాన్ని ఆలాపించే అరుదైన అవ‌కాశాన్ని ద‌క్కించుకుంది మేరీ మిల్ బెన్.

గీతాన్ని ఆలాపించిన అనంత‌రం అమెరికా సింగ‌ర్ ఉన్న‌ట్టుండి ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ పాదాల‌ను తాకారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్య‌మాల‌లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ట్విట్ట‌ర్ వేదిక‌గా మేరీ మిల్ బెన్(Mary Millben) కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌తి దేశానికి ఓ ప్ర‌త్యేక‌మైన జాతీయ గీతం ఉంటుంది. మోదీ టూర్ సంద‌ర్బంగా అమెరికాలో భార‌త జాతీయ గీతాన్ని ఆలాపించే అదృష్టం త‌న‌కు క‌ల‌గ‌డం పూర్వ జ‌న్మ సుకృత‌మ‌ని పేర్కొంది.

తాను క‌ల‌లో కూడా అనుకోలేద‌ని , ఈ అవకాశం ఇచ్చినందుకు తాను ఎంత‌గానో రుణ‌ప‌డి ఉంటాన‌ని స్ప‌ష్టం చేశారు గాయ‌ని మేరీ మిల్ బెన్. మోదీ అధికారిక ప‌ర్య‌ట‌న ముగింపు కార్య‌క్ర‌మంలో సింగ‌ర్ సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా మారారు. మేరీ మిల్ బెన్ కు 38 ఏళ్లు. వాష్టింగ్ట‌న్ డీసీ లోని రోనాల్డ్ రీగ‌న్ బిల్డింగ్ అండ్ ఇంట‌ర్నేష‌న‌ల్ ట్రేడ్ సెంట‌ర్ లో యునైటెడ్ స్టేట్స్ ఇండియ‌న్ క‌మ్యూనిటీ ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది.

Also Read : Centre Shock : ఐఏఎస్..ఐపీఎస్ లకు కేంద్రం షాక్

 

Leave A Reply

Your Email Id will not be published!