Van Der Dassen : అబ్బా వాన్ డెర్ డసెన్ దెబ్బ
బౌలర్లకు సఫారీ బ్యాటర్ షాక్
Van Der Dassen : భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు సౌతాఫ్రికా హిట్టర్ వారెన్ డసెన్. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. భారీ స్కోర్ ను అలవోకగా ఛేదించారు. 211 పరుగుల లక్ష్యాన్ని ఇంకా 5 బంతులు మిగిలి ఉండగానే పూర్తి చేశారు.
మిల్లర్ కిల్లర్ చెలరేగి ఆడితే తానేమీ తక్కువ కాదంటూ వారెన్ డసెన్(Van Der Dassen) షాన్ దార్ ఇన్నింగ్స్ ఆడాడు. హర్షల్ పటేల్ కు చుక్కలు చూపించాడు. కళ్లు చెదిరే షాట్లతో ఔరా అనిపించాడు డసెన్.
ఓ వైపు మిల్లర్ మరో వైపు వారెన్ డసెన్ దెబ్బకు బైర్లు కమ్మాయి భారత ఆటగాళ్లకు. పేలవమైన బౌలింగ్ తీరు ప్రత్యక్షంగా కనిపించింది. ఎలాంటి బంతుల్ని వేసినా దంచి కొట్టారు ఈ ఇద్దరు ఆటగాళ్లు.
భారీ సిక్సర్లను సులభంగా ఆడడం విస్తు పోయేలా చేసింది. ఐపీఎల్ లో విధ్వంసకరమైన ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్న మిల్లర్ మరోసారి దానిని కంటిన్యూ చేశాడు.
ఇక డసెన్ డేవిడ్ మిల్లర్ తో కలిసి 64 బంతులు ఆడి 131 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేశారు.
ఇక హర్షల్ పటేల్ వేసిన 17వ ఓవర్ లో డసెన్ చెలరేగి పోయాడు. 6, 6, 4, 0, 6 , 0 తో 22 పరుగులు రాబట్టాడు. 37 బంతుల్లో 3 ఫోర్లు 4 సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.
ఇదిలా ఉండగా 29 పరుగుల వద్ద వాన్ డెర్ డసెన్(Van Der Dassen) ఇచ్చిన క్యాచ్ ను శ్రేయస్ అయ్యర్ వదిలేయడంతో భారత్ తగిన మూల్యం చెల్లించుకుంది.
ఇదిలా ఉండగా కరోనా సోకడంతో చివరి నిమిషంలో మార్క్ రమ్ ను తప్పించారు.
Also Read : అబ్బా వాన్ డెర్ డసెన్ దెబ్బ