Vande Bharat Train: త్వరలో కశ్మీర్ లోయలో పరుగులు పెట్టనున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్
త్వరలో కశ్మీర్ లోయలో పరుగులు పెట్టనున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్
Vande Bharat Train : కేంద్ర ప్రభుత్వం, ఇండియన్ రైల్వేస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ సర్వీసులను దేశం నలుమూలలకు విస్తరించేందుకు చర్యలు ముమ్మరం చేసారు. దీనిలో భాగంగా వందేభారత్(Vande Bharat Train) సర్వీసు తొలిసారి కశ్మీర్ లోయ లో కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఏప్రిల్ 19న కట్రా-శ్రీనగర్ మధ్య ప్రత్యేక వందే భారత్ రైల్వే సర్వీసును ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేయబోయే బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. వాటితోపాటు జమ్మూకశ్మీర్ లోని చీనాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే వంతెనను సందర్శించనున్నారని సమాచారం. తొలుత ఈ రైలు కట్రా నుంచి శ్రీనగర్ ల మధ్య నడవనుందని… జమ్ము రైల్వేస్టేషన్ విస్తరణ పనులు పూర్తయిన తర్వాత అక్కడినుంచి శ్రీనగర్ కు దాని సేవలు విస్తరిస్తారని తెలుస్తోంది.
Vande Bharat Train Extend to Kashmir
ఇదిలాఉంటే ఇంజినీరింగ్ అద్భుతమైన చీనాబ్ వంతెనపై ఇటీవల తొలిసారి వందే భారత్ రైలు పరుగులు పెట్టింది. ఈ సెమీ హైస్పీడ్ వందేభారత్ రైలు ట్రయల్ రన్ ను భారత రైల్వే నిర్వహించింది. కట్రాలోని శ్రీ మాతా వైష్ణోదేవి రైల్వేస్టేషన్ నుంచి శ్రీనగర్ వరకు వందేభారత్ రైలు ప్రయాణించింది. ఈ మార్గమధ్యంలో చీనాబ్ నది పై నిర్మించిన వంతెన ప్రధాన ఆర్చ్‌పై రైలు పరుగులు పెడుతున్న దృశ్యాలు వీక్షకులను ఆకట్టుకుంటున్నాయి. కశ్మీర్ లోయలోని అతిశీతల వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా ఈ వందే భారత్ రైలును ప్రత్యేకంగా రూపొందించారు. నీరు గడ్డ కట్టకుండా ఉంచేలా అత్యాధునిక హీటింగ్ వ్యవస్థలను ఇందులో ఏర్పాటుచేశారు.
Also Read : Pastor Praveen Pagadala: పాస్టర్ ప్రవీణ్ మృతిపై సమగ్ర విచారణకు సీఎం ఆదేశం