Varalaxmi Vratham : తెలుగింట ప్రత్యేక పండుగగా చూసే ‘వరలక్ష్మీ వ్రతం’ శుభాకాంక్షలు

ఈ మాసంలో మంగళవారాలు, శుక్రవారాలు లక్ష్మిదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుస్తాం...

Varalaxmi Vratham : తెలుగింటి ఆడపడుచుల ముఖ్యమైన పండుగల్లో శ్రావణమాసంలో వచ్చే వరలక్ష్మీ వ్రతం ప్రముఖమైన పండుగ. పూలు, గుమ్మాలకు మామిడాకులు కట్టడం సంప్రదాయంగా వస్తోంది. లక్ష్మీదేవిని వరలక్ష్మీగా కూడా పిలుస్తారు. వరలక్ష్మీ అంటే వరాలు ప్రసాదించే దేవత అని అర్థం. ఆమె భక్తులకు అన్నీ విధాలా అనుగ్రహిస్తుంది. భక్తితో వేడుకుంటే వరాలందించే వరలక్ష్మీ వ్రతాన్ని(Varalaxmi Vratham) ఆచరించడానికి ఏ నియమాలు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్రత ఉంటే సరిపోతుంది. ఎంతో మంగళకరమైన ఈ వ్రతాన్ని ఆచరిస్తే సకల శుభాలు కలుగుతాయి. ఇలా చేయడం వల్ల ఎంతో మంచిది.

Varalaxmi Vratham…

శ్రావణమాసం ఆడవారి పండుగ. ఈ మాసంలో మంగళవారాలు, శుక్రవారాలు లక్ష్మిదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుస్తాం. శ్రావణమాసంలో ప్రతిరోజూ శుభదినంగా భావిస్తాం. ముఖ్యంగా మంగళవారాలు గౌరీదేవిని, శుక్రవారంలో లక్ష్మీదేవిని పూజిస్తారు. ఈ మాసంలో అమ్మవారిని పూజించడం వల్ల సౌభాగ్యాన్ని చల్లగా కాపాడుతుందని నమ్మకం. లక్ష్మీదేవి కరుణాకటాక్షాలు ప్రతి స్త్రీ యందు ఉండాలని కొలుస్తారు. లక్ష్మీదేవిని ఘనంగా పూజిస్తారు. ఈ మాసంలో వరలక్ష్మీ వ్రతాన్ని పెళ్ళయిన స్త్రీలు తప్పక పాటిస్తారు. ఈ వ్రతంలో అష్టలక్ష్ములను ఆరాధిస్తారు. బంగారంతో చేసిన లక్ష్మీదేవి ప్రతిమను తమ స్థోమత ప్రకారం దేవి దగ్గర ఉంచి దానిని మెడలో ధరిస్తారు. కొత్త చీర, గాజులు లక్ష్మీదేవికి సమర్పిస్తారు. చేతికి కట్టుకునే తోరణంతో పూజ పూర్తవుతుంది.

Also Read : Aadudam Andhra: ‘ఆడుదాం ఆంధ్ర’ నిధుల దుర్వినియోగంపై విచారణకు సీఐడి ఆదేశం !

Leave A Reply

Your Email Id will not be published!