Vedanta Assurance : మరాఠాలో $20 బిలియన్లతో ప్రాజెక్టు
హామీ ఇచ్చిన వేదాంత కంపెనీ
Vedanta Assurance : మహారాష్ట్రలో ఏర్పాటు చేయాల్సిన చిప్ కంపెనీని గుజరాత్ కు కేటాయించడంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దీనిపై శివసేన మాజీ మంత్రి ఆదిత్యా ఠాక్రేతో పాటు ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే మండిపడ్డారు.
కంపెనీ తరలి పోయేందుకు సీఎం షిండే, డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే కారణమంటూ ఆరోపించారు. దీంతో బీజేపీ సంకీర్ణ సర్కార్ పై సర్వత్రా నిరసన వ్యక్తం కావడంతో దిద్దుబాటు చర్యలకు దిగారు సీఎం.
ఈ మేరకు ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో చర్చించారు. ఆయన దానితో సమానమైన ప్రాజెక్టును మరాఠాకు వచ్చేలా చేస్తానని హామీ ఇచ్చారు. ఇదే విషయాన్ని ప్రకటించారు.
ఈ తరుణంలో వేదాంత కంపెనీ(Vedanta Assurance) చైర్మన్ అనిల్ అగర్వాల్ సంచలన ప్రకటన చేశారు. ప్రభుత్వాల ఒత్తిళ్ల మధ్య తాము నిర్ణయం తీసుకోలేదన్నారు.
గత కొన్ని నెలలుగా గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాలను పరిశీలించామని నిపుణుల కమిటీ సూచనల మేరకు తాము గుజరాత్ వైపు మొగ్గు చూపాల్సి వచ్చిందని స్పష్టం చేశారు.
ఇదే సమయంలో తమకు మరాఠా పట్ల వివక్ష లేదని ట్విట్టర్ వేదికగా స్పందించారు. తాజాగా చిప్ కంపెనీ తరలి పోవడం ఆత్మ గౌరవానికి భంగం కలిగించేలా ఉందంటూ విపక్షాలు ధ్వజమెత్తాయి.
దీంతో మరో కీలకమైన హామీని ఇచ్చింది కేంద్రం. పీఎం చొరవతో వేదాంత కంపెనీ కీలక ప్రకటన చేసింది గురువారం. ఈ మేరకు $20 బలియన్ల ఖర్చుతో కొత్త ప్రాజెక్టును ఏర్పాటు చేస్తామని తెలిపింది.
ఈ అంశంపై సీఎం షిండే ప్రధానితో మాట్లాడారని ఆ మేరకు స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు మంత్రి ఉదయ్ సమంత.
Also Read : అందనంత దూరంలో అదానీ