Vemula Prashanth Reddy : రేవంత్ సర్కార్ తెలంగాణ ఆత్మను తాకట్టు పెట్టింది
రేవంత్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు...
Vemula Prashanth Reddy : తెలంగాణకు సంబంధం లేని దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని రాష్ట్ర సచివాలయం ఎదుట పెట్టడం సిగ్గుమాలిన చర్య అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత వేముల ప్రశాంత్ రెడ్డి(Vemula Prashanth Reddy) విమర్శలు చేశారు. తెలంగాణ తల్లి విగ్రహం ఉండాల్సిన చోట రాజీవ్ విగ్రహాన్నిపెట్టడం అంటే తెలంగాణ తల్లిని అవమానించడమేనని వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ బాసులకు ప్రసన్నం చేసుకోవడానికి.. తెలంగాణ ఆత్మను తాకట్టు పెట్టారని ఆరోపించారు. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆనాడే సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని భావించారని అన్నారు. 2023 జూన్‌లో అందుకు సంబంధించిన ప్రణాళికలను సైతం సిద్ధం చేశారని గుర్తుచేశారు. సచివాలయానికి, అమరజ్యోతి మధ్య అనుసంధానంగా ఉండేలా కేసీఆర్ చేశారని చెప్పారు. కానీ రేవంత్ చర్యలు అందుకు విరుద్ధంగా ఉన్నాయని ధ్వజమెత్తారు. డైవర్ట్ పాలిటిక్స్‌లో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి ఇలాంటి పనులు చేస్తున్నారని వేముల ప్రశాంత్ రెడ్డి(Vemula Prashanth Reddy) విమర్శలు చేశారు.
Vemula Prashanth Reddy Comment..
రేవంత్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే తెలంగాణ తల్లి గౌరవం పెంచేలా తమ చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. అమరజ్యోతి కట్టి ఏడాది దాటినా రేవంత్ దాన్ని ఇంకా అందుబాటులోకి తీసుకు రావడం లేదని అన్నారు. కేసీఆర్ కట్టిన సచివాలయంలోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ మంత్రులు కూర్చుంటున్నారని వేముల ప్రశాంత్ రెడ్డి గుర్తుచేశారు. కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో రివ్యూలు చేస్తున్నారని అన్నారు. కానీ కేసీఆర్ కట్టారన్న కారణంతో అమరజ్యోతిని సీఎం రేవంత్‌రెడ్డి పట్టించుకోవడం లేదని విమర్శించారు. తెలంగాణ అమరులను అగౌరవ పరచవద్దని వేముల ప్రశాంత్ రెడ్డి హితవు పలికారు. అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించి ఏడాది అవుతున్న ఇంకా లోపలకు సందర్శకులను ఎందుకు అనుమతించడం లేదని నిలదీశారు. కేసీఆర్ కట్టినందుకే అనుమతించడం లేదా అని అడిగారు. కేసీఆర్ ఆనవాళ్లు ఎవరు చెరిపేయలేరని వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Also Read : Prakasam Barrage : పడవల తొలగింపునకు మరో కొత్త విధానం