Vemula Veeresham: సైబర్ నేరగాళ్ల వలలో కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం
సైబర్ నేరగాళ్ల వలలో కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం
Vemula Veeresham : సైబర్ నేరగాళ్ళ వలకు తెలంగాణాలోని నకిరేకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం చిక్కుకున్నారు. అయితే సైబర్ నేరగాళ్ళ పన్నాగాన్ని పసిగట్టిన ఎమ్మెల్యే… సకాలంలో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో త్రుటిలో వారి నుండి బయటపడ్డారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే… సైబర్ నేరగాళ్ళు ఎమ్మెల్యే వేముల వీరేశంకు(Vemula Veeresham) నగ్నంగా ఉన్న అమ్మయితో వీడియో కాల్ చేయించి… కొన్ని సెకన్ల పాటు దానిని స్క్రీన్ రికార్డింగ్ చేసారు. అనంతరం ఆ వీడియోను ఎమ్మెల్యే నంబర్ కు పంపించి బెదిరింపులకు దిగారు. డబ్బులు ఇవ్వకుంటే వీడియోను సోషల్‌మీడియాలో పోస్టు చేస్తామంటూ బెదిరించారు. ఆయన స్పందించకపోవడంతో ఆ వీడియోను కొందరు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలకు పంపారు. దీనితో సైబర్ మోసగాళ్ల పన్నాగాన్ని పసిగట్టిన ఎమ్మెల్యే వీరేశం వెంటనే నకిరేకల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల సూచనతో ఆ నంబర్ ను ఎమ్మెల్యే బ్లాక్ చేశారు.
MLA Vemula Veeresham Trapped
పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం వీరేశం మీడియాతో మాట్లాడుతూ.. సైబర్ ఘటనలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇలాంటి ఘటనలు మీ దృష్టికి వస్తే పోలీసుల దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు. నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు వేముల వీరేశం ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Also Read : Sonia Gandhi: మంత్రి కొండా సురేఖకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ లేఖ