Venkatesh Prasad Miandad : మియందాద్ పై ప్రసాద్ ఫైర్
పాకిస్తాన్ కు అంత సీన్ లేదు
Venkatesh Prasad Miandad : బీసీసీఐపై నోరు పారేసుకున్న పాకిస్తాన్ మాజీ క్రికెటర్ జావేద్ మియందాద్ పై నిప్పులు చెరిగారు భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్. కావాలని పాకిస్తాన్ తో ఆడడం లేదని మాట్లాడటం మంచి పద్దతి కాదన్నారు. ముందు నుంచి ఎవరు బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నారో క్రికెట్ లోకానికి తెలుసన్నారు.
ఇవాళ ట్విట్టర్ వేదికగా స్పందించారు మాజీ స్టార్ బౌలర్. భారత్ పాకిస్తాన్ తో ఆడక పోవడం వల్ల ఎలాంటి నష్టం ఉండదన్నారు. కానీ పాకిస్తాన్ గనుక ఇండియాతో ఆడక పోతే తీవ్రంగా నష్ట పోతుందని హెచ్చరించాడు. ఆ విషయం తెలుసుకుంటే బెటర్ అని సూచించాడు. వరల్డ్ క్రికెట్ ను బీసీసీఐ శాసిస్తుందని నిరాధార ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టాడు వెంకటేశ్ ప్రసాద్(Venkatesh Prasad). ముందు మీ దేశంలో శాంతి భద్రతలు బాగుపడేలా చూస్తే చాలన్నాడు
. కేవలం సెక్యూరిటీ లేక పోవడం వల్లనే ముందు జాగ్రత్తగా బీసీసీఐ భారత్ ను పంపేందుకు ఇష్ట పడలేదని ఆ విషయం గురించి తెలిపిందన్నాడు. ఇదే విషయాన్ని కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా చెప్పారని గుర్తు చేశారు. ఒకవేళ తటస్థ వేదికపై ఆడేందుకు సుముఖత వ్యక్తం చేసిందని , దానిని అర్థం చేసుకోకుండా మియందాద్ ఇలా చవకబారు ఆరోపణలు చేయడాన్ని తప్పు పట్టారు.
బీసీసీఐపై ఐసీసీ నియంత్రణ లేకుండా పోయిందని ఆరోపించాడు. బీసీసీఐ చెప్పినట్లు ఐసీసీ ఆడుతోందని, ఇంక ఐసీసీ ఎందుకు అని ప్రశ్నించాడు జావేద్ మియందాద్. భారత్ ను తొలగించాలని కూడా కోరాడు. దీనిపై భగ్గుమన్నాడు వెంకటేశ్ ప్రసాద్.
Also Read : అరుదైన రికార్డ్ కు చేరువలో కోహ్లీ