Venkatesh Prasad Rahul : రాహుల్ నిరాశ ప్రసాద్ విమర్శ
ఇలా ఇంకెంత కాలం కొనసాగిస్తారు
Venkatesh Prasad Rahul : భారత క్రికెట్ జట్టు మాజీ స్టార్ బౌలర్ వెంకటేశ్ ప్రసాద్ మరోసారి ఫైర్ అయ్యాడు. ఇటీవల బాగా ఆడక పోయినా కేఎల్ రాహుల్ ను బీసీసీఐ వెనకేసుకు వస్తోందంటూ సంచలన ఆరోపణలు చేశాడు. దీనిపై పెద్ద ఎత్తున రాహుల్ ఫ్యాన్స్ మండిపడ్డారు.
తాజాగా వెంకటేశ్ ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆస్ట్రేలియాతో జరిగిన రెండు టెస్టుల్లో పూర్తిగా విఫలమయ్యాడు. నాగ్ పూర్ లో నిరాశ పరిచిన కేఎల్ రాహుల్ ఢిల్లీలో జరిగిన రెండో టెస్టులో మొదటి ఇన్నింగ్స్ లో 17 పరుగులు చేస్తే రెండో ఇన్నింగ్స్ లో కేవలం 1 పరుగు మాత్రమే చేశాడు.
విచిత్రం ఏమిటంటే ఈ రెండు టెస్టుల్లో టీమిండియా ఘన విజయాన్ని సాధించింది. ప్రస్తుతం 2-0 తేడాతో ఆధిక్యంలో ఉంది. టెస్టుల్లో వరుసగా వైఫల్యం చెందుతున్నా ఎందుకని కేఎల్ రాహుల్(KL Rahul) ని కొనసాగిస్తున్నారంటూ ప్రశ్నించాడు వెంకటేశ్ ప్రసాద్(Venkatesh Prasad Rahul). దేశంలోని వివిధ ప్రాంతాలలో అద్భుతంగా యువ ఆటగాళ్లు రాణిస్తున్నారని అయినా ఎందుకు పక్కన పెడుతున్నారంటూ నిలదీశారు. తనకు కేఎల్ రాహుల్ తో వ్యక్తిగత సమస్యలు లేవని స్పష్టం చేశాడు.
నేను అతడికి మంచి జరగాలని కోరుకుంటున్నానని అన్నాడు. ఇలాగే ఆడుతూ పోతే ఉన్న నమ్మకం కూడా కోల్పోతాడని హెచ్చరించాడు. ఎవరైనా బాగానే ఆడాలని కోరుకుంటారని తాను కూడా ఇలాగే ఆలోచిస్తున్నట్లు తెలిపాడు వెంకటేశ్ ప్రసాద్. ఐపీఎల్ లో లక్నో జెయింట్స్ కు సారథ్యం వహిస్తున్నందుకే కేఎల్ రాహుల్(KL Rahul) ను బీసీసీఐ వెనకేసుకు వస్తున్నారంటూ సంచలన కామెంట్స్ చేశాడు.
Also Read : టీమిండియాపై జే షా ముద్ర