Rishabh Pant : ఈ ఏడాది బాగా కలిసి వచ్చినట్లుంది రిషబ్ పంత్ కు. కెప్టెన్సీ రేసులో తాను కూడా ఉన్నాడంటూ దిగ్గజ మాజీ ఆటగాళ్లు చెబుతూ వచ్చినప్పటికీ బీసీసీఐ సెలక్షన్ కమిటీ మాత్రం వారి అంచనాలు నిజమేనంటూ సంకేతాలు ఇచ్చింది.
తాజాగా భారత్ లో వెస్టిండీస్ ఇప్పటికే వన్డే సీరీస్ కోల్పోయింది. ఇక మిగిలింది టీ20 సీరీస్. ఇప్పటికే మూడు మ్యాచ్ లలో గెలుపొంది క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా టీ20 సీరీస్ పై కన్నేసింది.
దీంతో ఇప్పటి వరకు వైస్ కెప్టెన్ గా ఉన్న కేఎల్ రాహుల్ గాయం కారణంగా తప్పు కోవడంతో ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై తర్జన భర్జనలు పడిన సెలెక్షన్ కమిటీ ఉన్నట్టుండి రిషబ్ పంత్(Rishabh Pant )వైపు మొగ్గు చూపింది.
ఇప్పటికే ఐపీఎల్ లో మనోడు ఢిల్లీ క్యాపిటల్స్ కు సారథ్యం వహిస్తున్నాడు. కొంత అనుభవం కూడా దక్కింది. మరో ధోనీ లాగా మారతాడని, అతడికి టెస్టు కెప్టెన్సీ అప్పగించాలని ఇటీవల భారత్ సఫారీ టూర్ సందర్భంగా ఓటమి మూట గట్టుకున్నాక వచ్చిన అభిప్రాయం అది.
తాజాగా విండీస్ తో జరగబోయే టీ20 సీరీస్ కు రోహిత్ శర్మకు తోడుగా వైస్ కెప్టెన్ గా రిషబ్ పంత్ (Rishabh Pant )ను నియమిస్తున్నట్లు ప్రకటించింది . ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది సెలెక్షన్ కమిటీ.
రేపటి నుంచి అంటే ఈనెల 16 నుంచి టీ20 సీరీస్ ప్రారంభం కానుంది. రాహుల్ తో పాటు సుందర్ కూడా ఆడడం లేదు. ఇక టీ20కి సంబంధించి మన జట్టు ఇలా ఉంది.
రోహిత్ కెప్టెన్ కాగా పంత్ వైస్ కెప్టెన్. వీరితో పాటు ఇషాన్ కిషన్ , కోహ్లీ, అయ్యర్, యాదవ్ , చహాల్ , సిరాజ్ , భువీ, ఆవేశ్ ఖాన్ , పటేల్ , రుతురాజ్ , హూడా, కుల్దీప్ ఉన్నారు.
Also Read : ‘కీగన్ ..నైట్’ ప్లేయర్ ఆఫ్ ది మంత్