Minister Ponmudy : వరద సాయం అందలేదన్న కోపంతో మంత్రి పై బురద చల్లిన బాధితులు

ఫెంగల్‌ తుఫాను ప్రభావంతో విల్లుపురం జిల్లా అతలాకుతలమైన విషయం తెలిసిందే...

Minister Ponmudy : విల్లుపురం జిల్లా ఇరువేల్‌పట్టు ప్రాంతంలో తగిన సాయం అందలేదన్న కోపంతో బాధితులు రాష్ట్ర మంత్రిపైనే బురదచల్లడం ఉద్రిక్తతకు దారి తీసింది. వివరాలిలా వున్నాయి… ఫెంగల్‌ తుఫాను ప్రభావంతో విల్లుపురం జిల్లా అతలాకుతలమైన విషయం తెలిసిందే. దిండివనం సమీపం మయిల్‌ ప్రాంతంలో అత్యధికంగా 51 సెం.మీ వర్షపాతం నమోదుకావడం, సమీపంలోని చెరువు గట్లు తెగడంతో దిండివనం కూడా జలమయమైంది.

Minister Ponmudy Got Attacked…

వరద బాధిత ప్రాంతాల్లో సైనికులు సహాయక చర్యలు చేపట్టి, బాధితులను విల్లుపురం పునరావాస శిబిరాలకు తరలించారు. ఈ నేపథ్యంలో, మంగళవారం వరద బాధిత ప్రాంతాలు పరిశీలించి బాధితులకు సహాయాలందించేందుకు మంత్రి పొన్ముడి(Minister Ponmudy), జిల్లా కలెక్టర్‌, అటవీ శాఖ అధికారులు విల్లుపురం చేరుకున్నారు. ఇరువేల్‌పట్టు ప్రాంతంలో ప్రజలు ఆందోళన చేపడుతున్నారని తెలుసుకున్న మంత్రి వారితో మాట్లాడేందుకు వెళ్లారు. అయితే మంత్రి పర్యటనను ఆందోళనకారులు అడ్డుకున్నారు. ప్రభుత్వం నుంచి తమకెలాంటి సాయం అందలేదని, శిబిరంలో ఆహారం కూడా అందించడం లేదని నినాదాలు చేపట్టారు. అయితే ఇదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు మంత్రిపై బురద చల్లారు. అక్కడున్న పోలీసులు మంత్రి చుట్టూ నిలిచారు. నిరసనకారుల ఆగ్రహాన్ని గ్రహించిన మంత్రి పొన్ముడి.. అక్కడి నుంచి మౌనంగా వెళ్లిపోయారు.

Also Read : Amritsar Golden Temple : అకాలీదళ్ నేత ‘సుఖ్‌బీర్‌ సింగ్’ పై గోల్డెన్ టెంపుల్ వద్ద కాల్పులు

Leave A Reply

Your Email Id will not be published!