TVK Party Chief Vijay : టీవీకే పార్టీ బలోపేతంలో భాగంగా 28 అనుబంధ విభాగాలు
ఇందులో భాగంగా తాజాగా 28 అనుబంధ విభాగాలను ఏర్పాటు చేశారు...
TVK Party : హీరో విజయ్ సారథ్యంలోని తమిళగ వెట్రి కళగం(టీవీకే) బలోపేతంలో భాగంగా కొత్తగా 28 అనుబంధ విభాగాలను నియమించారు. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు విజయ్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఇటీవలే రెండో యేడాదిలోకి అడుగుపెట్టిన టీవీకే(TVK Party)ను 2026లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడంపై విజయ్ దృష్టిసారించారు. ఇందులో భాగంగా తాజాగా 28 అనుబంధ విభాగాలను ఏర్పాటు చేశారు.
TVK Party Chief Vijay Comment
ఇప్పటిరకుఏ రాజకీయ పార్టీలో లేని విధంగా హిజ్రాలకు కూడా ఓ విభాగాన్ని టీవీకేలో ఏర్పాటు చేయడం గమనార్హం. ఆ పార్టీ విభాగాలను ఓసారి పరిశీలిస్తే మీడియా వింగ్‌తో పాటు ఐటీ, న్యాయవాదులు, ప్రచార, ప్రతినిధులు, సభ్యత్వ నమోదు , శిక్షణ, కార్యకర్తల నైపుణ్య అభివృద్ధి, పర్యావరణం, హిస్టరీ, రీసెర్స్, ఇన్ఫర్మేషన్, హిజ్రాల వింగ్, దివ్యాంగులు, యువజన, విద్యార్థి, మహిళలు, యువతులు, చిన్నారులు, కార్యకర్తలు, వ్యాపారులు, జాలర్లు, చేనేత కార్మికులు, పదవీ విరమణ, ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, ప్రవాస భారతీయులు, వైద్యం, రైతులు, సాంఘిక, సంస్కృతి, సాంప్రదాయం, స్వచ్చంధకారులు, అఖిల భారత దళపతి విజయ్ మక్కల్ ఇయ్యక్కం వంటి మొత్తం 28 విభాగాలను ఏర్పాటు చేశారు. ఈ జాబితాను భారత ఎన్నికల సంఘానికి టీవీకే ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్ సారథ్యంలోని టీవీకే బృందం సమర్పించనుంది.
ఇటీవలేఆవిర్భవించిన టీవీకేకు రాష్ట్రంలో 20 శాతం ఓటు బ్యాంకు వుందంటూ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ నివేదిక సమర్పించారని, సామాజిక మాధ్యమాల్లో విస్త్రత ప్రచారం జరుగుతోంది. అయితే దీనిని రాజకీయ విశ్లేషకులు మాత్రం కొట్టిపారేస్తున్నారు. స్థాపించి ఏడాది కూడా కాని పార్టీకి అంత ఓటు బ్యాంకు ఎలా వస్తుందని ప్రశ్నిస్తున్నారు. సీనియర్ వ్యూహకర్త అయిన ప్రశాంత్ కిశోర్ పేరుతో టీవీకే నిర్వాహకులు ప్రచారం చేసుకుంటున్నారని వారు విమర్శిస్తున్నారు.
Also Read : తెలంగాణ సర్కార్ కు ఘాటు వార్నింగ్ ఇచ్చిన కేంద్రమంత్రి