Vijay Devarakonda : ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రష్మిక మందన్నా తాను పెళ్లి చేసుకున్నట్లు వచ్చిన వార్తలన్నీ అబద్దమని కొట్టి పారేశాడు. ఇవాళ దానిపై స్పందించాడు.
పుకార్లు తప్ప మరేమీ కాదన్నారు. తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమేనని పేర్కొన్నాడు. ఇలాంటి నిరాధారమైన ప్రచారం ఎలా చేస్తారంటూ ప్రశ్నించాడు. ఇదంతా నాన్ సెన్స్ కొట్టి పారేశాడు.
వీరిద్దరూ తమ తమ రంగాలలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం రౌడీ హీరోగా పేరొందిన విజయ్ దేవరకొండ(Vijay Devarakonda )పూరీ జగన్నాథ్ చిత్రం లైగర్ లో నటిస్తున్నాడు. ఇక రష్మిక మందన్నా మోస్ట్ పాపులర్ హీరోయిన్ గా పేరొందింది.
గతంలో నటించిన చిత్రాల కంటే ఐకాన్ స్టార్ బన్నీతో సుకుమార్ తీసిన పుష్ప మూవీ సూపర్ డూపర్ హిట్ గా పేరొందింది. పాన్ ఇండియా సినిమాగా తెరెక్కించిన ఈ చిత్రం గతంలో ఉన్న రికార్డులను తిరగ రాసింది.
ఇక ఇందులో రష్మిక చేసిన డ్యాన్స్ , నటన ప్రేక్షకులను మరింత దగ్గరకు చేసింది. ప్రస్తుతం ఆమె నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు కూడా విడుదలకు సిద్దంగా ఉంది.
ముంబైలో విజయ్ తో కలిసి కొన్ని సార్లు రష్మిక మందన్నా రెస్టారెంట్ కు వెళ్లి వస్తుండగా కెమెరాలకు చిక్కింది. దీంతో వీరిద్దరి మధ్య ప్రేమ కొనసాగుతోందన్న ప్రచారం జోరుగా సాగింది.
దీనికి పుల్ స్టాప్ పెట్టాడు విజయ్ దేవరకొండ. కాగా ఇవాళ ఫుల్ బ్లాక్ డ్రెస్ తో మరింత అందంగా కనిపించింది రష్మిక మందన్నా. ఇక రౌడీ, రష్మిక కలిసి గీత గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి సినిమాలలో కలిసి నటించారు.
Also Read : బాక్సులు బద్దలు కొడుతున్న’ డీజే టిల్లు’